Site icon 10TV Telugu

DMHO Nellore Recruitment : నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో పలు ఖాళీల భర్తీ

DMHO Nellore Recruitment

DMHO Nellore Recruitment

DMHO Nellore Recruitment : నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్‌ విధానంలో ఈ ఖాళీలను తీసుకోనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీల్లో మెడికల్ ఆఫీసర్ 25, ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ 1 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్‌ లేదా పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులను అకడమిక్‌లో సాధించిన మార్కులు, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంవో పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 53,495, ఎఫ్‌సీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 వరకు చెల్లిస్తారు.

అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయం, నెల్లూరు చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 12 , 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://spsnellore.ap.gov.in/ పరిశీలించగలరు.

Exit mobile version