Punjab and Sind Bank Recruitment : భారత ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి , అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి టెక్నికల్ ఆఫీసర్, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ఫారెక్స్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్, ట్రెజరీ డీలర్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/ బీటెక్/ఎంబీఏ/పీజీడీబీఏ/పీజీడీబీఎం/సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ)/ఎంటెక్/ఎంసీఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రాతిపదికన తుది ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 20, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://punjabandsindbank.co.in/content/recuitment పరిశీలించగలరు.