THDC India Limited Recruitment : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోనున్న టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సీఏ/ఐసీఎంఏఐ (ఐసీడబ్ల్యూఏ) లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి.విద్యార్హతలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1, 80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. పూర్తి వివరాలకు వెబ్ బైట్ ; https://www.thdc.co.in/ పరిశీలించగలరు.