Site icon 10TV Telugu

DCCB Eluru Recruitment : ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీ

Various jobs recruitment in Eluru District Co-operative Central Bank Limited

Various jobs recruitment in Eluru District Co-operative Central Bank Limited

DCCB Eluru Recruitment : ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 95 స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు ఇంగ్లిష్‌, తెలుగు భాషలు, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

అభ్యర్థులను ఆన్‌లైన్ టెస్ట్/ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 17,900 నుంచి రూ. 47,920 వరకు చెల్లిస్తారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు నవంబరు 20, 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://apcob.org/ పరిశీలించగలరు.

Exit mobile version