Site icon 10TV Telugu

విద్యారంగంలో విశేషమైన సేవలందించిన వారికి 10టీవీ ఘన సత్కారం… కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ

10tv Edu Visionary 2025

10tv Edu Visionary 2025

విద్యారంగంలో విశేషమైన సేవలందించిన వారిని 10టీవీ ఘనంగా సత్కరించింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారిని గుర్తించింది. 10TV Edu Visionary 2025 వేదికపైకి వారిని తీసుకొచ్చింది.

ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత మురళీ మోహన్, లోక్ సత్తా వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ్, సీబీఐ మాజీ జేడీ, రిటైర్డ్ ఐపీఎస్ వీవీ లక్ష్మీనారాయణ ఉన్నారు. వారి చేతుల మీదుగా కళాశాలల కృషికి సత్కారం జరిగింది.

ఉన్నత విద్యా రంగంలో విశేష సేవలందించిన కళాశాలలను 10టీవీ గుర్తించి Edu Visionary 2025 వేదికగా ఘన సత్కారం చేసింది. విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, ఉద్యోగావకాశాల దిశగా నడిపిన కళాశాలల కృషికి ఈ వేదిక ప్రతీకగా నిలిచింది.

ఏ కళాశాలలో చదివితే భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందనే ప్రశ్నకు ఈ కాఫీ టేబుల్ బుక్ సమాధానం. కళాశాలల స్థాయి, ఫలితాలు, క్యాంపస్ ప్లేస్‌మెంట్ అవకాశాలు అన్నింటినీ విద్యార్థులకు అందిస్తోంది. ఇది విద్యార్థులకు ఒక మార్గదర్శకం అవుతుంది.

10 టీవీ ఎడ్యూ విజనరీ 2025 పీడీఎఫ్ 

Exit mobile version