Site icon 10TV Telugu

Ginger Powder : చలికాలంలో అజీర్ణ సమస్యలను తొలగించి జీర్ణ శక్తిని మెరుగుపరిచే శొంఠి పొడి!

Ginger Powder :

Ginger Powder :

Ginger Powder : చలికాలంలో శొంఠిపొడిని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. శొంఠి పొడిలో మెగ్నీషియం, ఫైబర్, సోడియం, ఇనుము, విటమిన్లు A మరియు C, జింక్, ఫోలేట్ ఆమ్లం, కొవ్వు ఆమ్లాలు, కాల్షియం వంటివి ఉంటాయి. ప్రతి ఇంటి వంటగదిలో శొంఠి పొడి లభిస్తుంది. అల్లం ఎండబెట్టి, మెత్తగా పొడిగా మారుస్తారు దీనినే మనం శొంఠి పొడిగా పిలుస్తాం.

చలికాలంలో చిన్నపిల్లలకు ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యలను తొలగించే శక్తి శొంఠికి ఉంది. అరచెంచా నెయ్యి వేసి, వేడయ్యాక శొంఠి కొమ్ముని వేయించి తరువాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని అన్నంలో నెయ్యితోపాటు కలిపి మొదటి ముద్దగా నిత్యం తీసుకోవాలి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శొంఠి పొడిని నిమ్మరసంలో కలిపి సేవిస్తే పిత్త సమస్యలు తొలగిపోతాయి. శొంఠి, మిరియాలతో కలిపి కషాయం చేసి సేవిస్తే జలుబు మాయం అవుతాయి. తమలపాకులో కొద్దిగా పంచదార కలిపి నమలడం వల్ల గ్యాస్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది.

శొంఠి పొడిని టీ తయారు చేసి నిత్యం తాగితే దగ్గు సమస్య నుంచి బయటపడవచ్చు. అర టీస్పూన్ శొంఠి పొడిని ఒక గ్లాసు నీటిలో కలిపి గోరువెచ్చగా వేడి చేసి అందులో తేనె కలుపుకుని రోజూ తాగితే అందులోని థర్మోజెనిక్ ఏజెంట్పొట్టలోని కొవ్వును తగ్గించి శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు చికాకుపెడతాయి. అలాంటప్పుడు శొంఠి కొమ్ముని అరగదీసి, ఆ గంధాన్ని కొద్దిగా వెచ్చబెట్టి కీళ్లపై పలుచని పొరలా లేపనం వేసుకోవాలి. ఇలా చేస్తే, నొప్పుల నుంచి పొందవచ్చు.

ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ శొంఠి పాలను తీసుకుంటే జ‌బ్బుల‌ు దరిచేరవు. తేలికపాటి జ్వరం, తలనొప్పికి సాధారణ నీటిలో శొంఠి పొడిని కలిపి నుదుటిపై రాయాలి. మైగ్రేన్ తలనొప్పికి శొంఠి ఒక అద్భుతమైన ఔషధం. మూడు చిటికెల శొంఠి పొడిని తేనెలో కలిపి 45 రోజుల పాటు తీసుకుంటే తలనొప్పి మాయమవుతుంది. శొంఠి పాల‌ను నిద్రించే ముందు తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు చురుగ్గా మారి మ‌ల‌బ‌ద్ధ‌కం దూరం అవుతుంది.అదే స‌మ‌యంలో గ్యాస్‌, క‌డుపు ఉబ్బ‌రం, ఎసిడిటీ వంటి జీర్ణ స‌మ‌స్య‌లు దరిచేరవు.

 

Exit mobile version