Site icon 10TV Telugu

మనవడితో ఆటలాడుతున్న హాస్యబ్రహ్మ

Brahmanandam Playing with his Grandson-10TV

బ్రహ్మానందం తన మనవడిని సరదాగా ఆడిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

దాదాపు 30 ఏళ్ళకు పైగా, ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో, తన స్టైల్ మేనరిజమ్స్‌తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న కామెడీ కింగ్.. బ్రహ్మానందం.. ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.. హార్ట్ సర్జరీ చేయించుకున్న బ్రహ్మానందం, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి, ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ వంటి పలువురు సినీ పరిశ్రమకి చెందిన వాళ్ళు, ఇంటికెళ్ళి ఆయణ్ణి పరామర్శించారు. రీసెంట్‌గా బ్రహ్మానందం తన మనవడిని సరదాగా ఆడిస్తున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తన పెద్ద కొడుకు గౌతమ్ తనయుడితో కలిసి బ్రహ్మీ, తను కూడా పిల్లాడిలా మారిపోయి ఆడుతూ, ఆడిస్తున్న ఫోటో చూసి, బ్రహ్మానందం నవ్వితే బాగుంటారు, ఆడియన్స్‌ని నవ్విస్తే ఇంకా బాగుంటారు. ఎప్పుడూ ఇలా హుషారుగా ఉంటూ, వెండితెరపై నవ్వులు పంచాలి.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

Exit mobile version