OnePlus Nord CE 3 Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ఆగస్టు 5న వన్‌ప్లస్ నార్డ్ CE 3 ఫోన్ సేల్.. ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

OnePlus Nord CE 3 Sale : వన్‌ప్లస్ నుంచి నార్డ్ CE 3 ఫోన్ సేల్ ఆగస్టు 5న ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌పై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందించనుంది.

OnePlus Nord CE 3 Indian Sale tipped for August 5, offers revealed

OnePlus Nord CE 3 Sale : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ నెల ప్రారంభంలో వన్‌ప్లస్ (OnePlus) Nord 3, Nord CE 3 అనే పేరుతో రెండు అద్భుతమైన మిడ్ రేంజ్ డివైజ్‌లను ప్రకటించింది. Nord 3 ప్రీమియం వేరియంట్, Nord CE 3 ఫోన్ రూ. 30వేల సెగ్మెంట్లలో అందించనుంది. ఈ ఫోన్ లభ్యతపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ వన్‌ప్లస్ ఫోన్ ఆగస్టు 5 నుంచి భారత మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని టిప్‌స్టర్ వెల్లడించింది. బ్యాంక్ కార్డ్‌ల ద్వారా కొనుగోళ్లపై (OnePlus Nord CE 3) రూ. 2వేలు ధర తగ్గింపును పొందుతుందని తెలిపింది. వన్‌ప్లస్ ఫోన్ (8GB+128GB) వేరియంట్ అసలు ధర రూ. 26,999 ఉండగా.. రూ. 24,999కి తగ్గింపు ఉంటుందని అంచనా. అయితే, 12GB+256GB మోడల్ అసలు ధర రూ. 28,999 నుంచి రూ.26,999కి అందించే అవకాశం ఉంది.

Read Also : OnePlus vs iQoo : వన్‌ప్లస్ నార్డ్ 3 vs ఐక్యూ నియో 7 ప్రో.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

వన్‌ప్లస్ నార్డ్ CE 3 స్పెషిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ CE 3 సెల్ఫీ కెమెరా పంచ్-హోల్ కట్‌అవుట్‌తో 6.7-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోను అందిస్తుంది. డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. మెరుగైన దృశ్య పర్ఫార్మెన్స్ 2160Hz PWM డిమ్మింగ్‌తో వస్తుంది. హుడ్ కింద, స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 782G, గరిష్టంగా 2.7GHz క్లాక్ స్పీడ్‌తో 6nm ఆక్టా-కోర్ CPU ద్వారా పవర్ అందిస్తుంది. ప్రాసెసర్ 8GB లేదా 12GB RAM, 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది.

OnePlus Nord CE 3 Indian Sale tipped for August 5, offers revealed

కెమెరాల విషయానికి వస్తే.. ఈ డివైజ్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ప్రధాన కెమెరా OISతో 50MP Sony IMX890 సెన్సార్‌ను కలిగి ఉంది. OnePlus Nord 3 మాదిరిగా ఉంటుంది. అదనంగా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో షూటర్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ డివైజ్ 16MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. డివైజ్ 5000mAh బ్యాటరీతో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. Nord CE 3 ఆక్సిజన్ OS 13.1తో Android 13 OSలో రన్ అవుతుంది.

Read Also : Infinix GT 10 Pro Pre order : ఆగస్టు 3 నుంచే ఇన్ఫినిక్స్ GT 10 ప్రో ఫోన్ ప్రీ-ఆర్డర్.. కీలక ఫీచర్లు అదుర్స్, ధర ఎంతో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు