YouTube: అబార్ష‌న్లు చేసే ప్ర‌క్రియ‌పై త‌ప్పుడు స‌మాచారంతో వీడియోలు.. యూట్యూబ్ చ‌ర్య‌లు

డ‌బ్ల్యూహెచ్‌వో లెక్క‌ల‌ ప్రకారం ప్ర‌పంచ వ్యాప్త‌గా ప్ర‌తి ఏడాది దాదాపు 7.3 కోట్ల అబార్ష‌న్లు జరుగుతున్నాయి. యూట్యూబ్ లో చూసి నేర్చుకుని గ‌ర్భ‌స్రావం చేయొచ్చ‌న్న భావ‌న కొంత‌మందిలో ఉంది. ఈ వైద్య ప్ర‌క్రియ‌కు సంబంధించిన త‌ప్పుడు ప్ర‌చారం యూట్యూబ్‌లో ఉంటోంది. ఆరోగ్య విష‌యాల‌పై క‌చ్చిత‌మైన, అధికారిక స‌మాచారాన్ని అందించ‌డం చాలా ముఖ్య‌మ‌ని మీడియాకు యూట్యూబ్ తెలిపింది. ఇటువంటి విష‌యాల‌పై ఉన్న‌ త‌మ విధానాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష జ‌రుపుతుంటామ‌ని చెప్పింది. తప్పుడు సమాచారంతో ఉండే వీడియోలను తొలగిస్తున్నామని వివరించింది.

YouTube: ప్ర‌స్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్ దాదాపు అంద‌రికీ అందుబాటులో ఉంటోంది. అందులో యూట్యూబ్‌ను చూసే సంఖ్య‌ విప‌రీతంగా పెరిగిపోయింది. దాని ద్వారానే ఎన్నో కొత్త విష‌యాలు తెలుసుకుంటున్నారు. వైద్య‌ విద్యార్థులు కూడా యూట్యూబ్ ద్వారా ఎన్నో విష‌యాలు నేర్చుకుంటున్నారు. అయితే, యూట్యూబ్‌లో అస‌త్య ప్ర‌చారం బెడ‌ద‌ కూడా ఎక్కువే. దీనికి తోడు మిడిమిడి జ్ఞానంతో కొంద‌రు వైద్య రంగానికి సంబంధించిన సున్నిత‌మైన‌ అంశాల‌పై కూడా వీడియోలు చేస్తున్నారు. అబార్ష‌న్ల వంటి అంశాల‌ విష‌యంలో వాటిని చూసి నేర్చుకుంటే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్లే.

ఈ నేప‌థ్యంలో యూట్యూబ్ తాజాగా ఓ ప్ర‌క‌ట‌న చేసింది. అబార్ష‌న్‌కు సంబంధించిన త‌ప్పుడు ప్ర‌చారాలు చేసే వీడియోల‌ను తొల‌గిస్తున్న‌ట్లు తెలిపింది. అమెరికాలో దాదాపు 50 ఏళ్ళ పాటు అమలులో ఉన్న అనంత‌రం అబార్షన్ హక్కుకు ఉన్న రాజ్యాంగ రక్షణలను ఇటీవ‌ల అక్క‌డి సుప్రీంకోర్టు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. 50 ఏళ్ళ క్రితం నాటి ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును కొట్టివేసి అమెరికాలో గర్భవిచ్ఛిత్తికి ఉన్న రాజ్యాంగ హక్కును తొలగించింది. 1973లో అక్క‌డి సుప్రీంకోర్టు అనివార్య పరిస్థితుల్లో అబార్ష‌న్‌ చేయించుకునే హక్కు మహిళలకు ఉందని తీర్పు చెప్పింది. దాన్నే ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేప‌థ్యంలో యూట్యూబ్ తాజాగా అబార్ష‌న్‌కు సంబంధించిన వీడియోల‌పై చ‌ర్య‌లు తీసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

డ‌బ్ల్యూహెచ్‌వో లెక్క‌ల‌ ప్రకారం ప్ర‌పంచ వ్యాప్త‌గా ప్ర‌తి ఏడాది దాదాపు 7.3 కోట్ల అబార్ష‌న్లు జరుగుతున్నాయి. యూట్యూబ్ లో చూసి నేర్చుకుని గ‌ర్భ‌స్రావం చేయొచ్చ‌న్న భావ‌న కొంత‌మందిలో ఉంది. ఈ వైద్య ప్ర‌క్రియ‌కు సంబంధించిన త‌ప్పుడు ప్ర‌చారం యూట్యూబ్‌లో ఉంటోంది. ఆరోగ్య విష‌యాల‌పై క‌చ్చిత‌మైన, అధికారిక స‌మాచారాన్ని అందించ‌డం చాలా ముఖ్య‌మ‌ని యూట్యూబ్ మీడియాకు తెలిపింది. ఇటువంటి విష‌యాల‌పై ఉన్న‌ త‌మ విధానాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష జ‌రుపుతుంటామ‌ని చెప్పింది. నేటి నుంచి కొన్ని వారాల పాటు సుర‌క్షితం కాని అబార్ష‌న్ ప్ర‌క్రియ‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను తొల‌గిస్తామ‌ని పేర్కొంది.

IndiGo: త‌న బ్యాగులో బాంబు ఉందంటూ.. విమాన ప్రయాణికులను బెంబేలెత్తించిన వ్యక్తి

ట్రెండింగ్ వార్తలు