Ind Vs SA T20 Series: పంత్ సేన బదులు తీర్చుకొనేనా.. నేడు దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. పిచ్ పరిస్థితి ఏమిటంటే..

యువరక్తంతో నిండిన టీమిండియా సఫారీల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు తహతహ లాడుతోంది. సౌతాఫ్రికా - ఇండియా మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి విజయం సఫారీల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టుపై ఓటమిపాలవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న టీమిండియా నేడు కటక్ వేదికగా జరిగే రెండో టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

Ind Vs SA T20 Series: యువరక్తంతో నిండిన టీమిండియా సఫారీల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు తహతహ లాడుతోంది. సౌతాఫ్రికా – ఇండియా మధ్య ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి విజయం సఫారీల ఖాతాల్లోకి వెళ్లిపోయింది. సొంతగడ్డపై ప్రత్యర్థి జట్టుపై ఓటమిపాలవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న టీమిండియా నేడు కటక్ వేదికగా జరిగే రెండో టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. అయితే టీమిండియాను ప్రధానంగా వేధిస్తున్న సమస్య బౌలింగ్. బౌలింగ్ విభాగంలో స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతుందా? లేక ఎలాంటి మార్పులు లేకుండా సఫారీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతారా అనే ఆసక్తికరంగా మారింది.

Ind Vs SA T20 Series: మేం ఓడిపోవటానికి ప్రధాన కారణం అతడే.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తొలి మ్యాచ్‌లో భారత్‌ టాప్‌–5 బ్యాటర్లంతా ఆకట్టుకున్నారు. ఇషాన్‌ కిషన్‌ శుభారంభం ఇవ్వగా, రుతురాజ్, శ్రేయస్‌ రాణించారు. ఆ తర్వాత పంత్‌ దూకుడుగా ఆడగా, హార్దిక్‌ తన ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగించాడు. వీరంతా మరోసారి చెలరేగితే మళ్లీ భారీ స్కోరు ఖాయం. అయితే ఇంత స్కోరు తర్వాత కూడా ఓడటం బౌలింగ్‌ వైఫల్యాలను తెలియజేసింది. అందరికంటే సీనియర్‌ అయిన భువనేశ్వర్‌ గతి తప్పగా, ఐపీఎల్‌లో చెలరేగిన హర్షల్‌ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఇందులో పంత్ కెప్టేన్సీ వైఫల్యం కూడా స్పష్టంగా కనిపించింది. ఏ దశలోనూ పంత్ చురుకైన వ్యూహాలు అమలు చేయలేక పోయాడు.

TS TET : నేడు టెట్ ఎగ్జామ్.. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!

మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు తుదిజట్టులో స్వల్ప మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. బరాబతి పిచ్ ను దృష్టిలో ఉంచుకొని ఒక స్పిన్నర్‌ స్థానంలో అదనంగా మరో పేసర్‌గా ఆడించాలని సఫారీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. మహరాజ్‌ స్థానంలో పేస్‌ బౌలర్లు ఇన్‌గిడి లేదా జాన్సెన్‌కు అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్ లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. అయితే బరాబతి పిఛ్ పూర్తిగా బౌలర్లకు అనుకూలించే పిచ్ గా భావిస్తున్నారు. ఈ వికెట్‌పై సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 136 పరుగులు. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ అత్యధిక విజయాలు (60శాతం) నమోదు చేసుకుంది. ఈ పిచ్ మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు అనుకూలించకపోవచ్చు. అయితే పేసర్లకు మాత్రం అనుకూలంగా ఉంటుంది. దక్షిణాఫ్రికాతో ఇదే మైదానంలో 2015లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 92 పరుగులకే కుప్పకూలింది.

Jio T20 Plans 2022 : జియో ఐపీఎల్ సరికొత్త ప్లాన్లు.. రివార్డులు.. డిస్నీ హాట్ స్టార్‌లో ఫ్రీగా లైవ్ మ్యాచ్‌లు చూడొచ్చు

తుది జట్లు (అంచనా):
భారత్‌: పంత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్, రుతురాజ్, శ్రేయస్‌ అయ్యర్, హార్దిక్, కార్తీక్, అక్షర్, హర్షల్, భువనేశ్వర్, అవేశ్, చహల్‌.
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), డికాక్, ప్రిటోరియస్, వాన్‌ డర్‌ డసెన్, మిల్లర్, స్టబ్స్, పార్నెల్, రబడ, నోర్జే, షమ్సీ, ఇన్‌గిడి/జాన్సెన్‌.

 

ట్రెండింగ్ వార్తలు