Unstoppable episode 4 : నేను బ్రతికున్నా కాబట్టి సీఎం అయ్యా.. కిరణ్ కుమార్ రెడ్డి!

నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ 'ఆహా'లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగో ఎపిసోడ్ అతిథిగా వచ్చాడు. ఇక ఈ ఎపిసోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డి, దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డి మరణం అప్పటి సంఘటనలు పంచుకున్నారు.

Unstoppable episode 4 : నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ‘ఆహా’లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇక రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో స్టార్ట్ చేసి సంచలనం సృష్టించారు. తాజాగా నాలుగో ఎపిసోడ్ లో బాలయ్య తన పాత స్నేహితులతో కలిసి సందడి చేశాడు.

Unstoppable episode 4 : కిరణ్ కుమార్ రెడీ కెప్టెన్సీలో ఆడిన టీమ్ ఇండియా కెప్టెన్.. ఎవరో తెలుసా?

ఈ ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పటి తెలంగాణ ఎంపీ సురేష్ రెడ్డి హాజరయ్యారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ ఎపిసోడ్ లో దివంగత వైస్ రాజశేఖర్ రెడ్డి మరణం అప్పటి సంఘటనలు పంచుకున్నారు. ఆ క్రమంలోనే ‘నేను బ్రతికున్నా కాబట్టి సీఎం అయ్యాను’ అంటూ వ్యాఖ్యానించాడు.

అయితే విషయం ఏంటంటే.. రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో మరణించిన సంగతి మనకి తెలిసందే. కాగా ఆ ఫ్లైట్ లో కిరణ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లాల్సి ఉందట. కానీ కిరణ్ కుమార్ కి పని ఉండడంతో, అయన వెళ్లలేక పోయాడు. దీంతో అయన అలా ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించాడు. అటువంటి లీడర్ ని కోలుపోడం చాలా దురదృష్టకరం అంటూ బాలయ్య వ్యాఖ్యానించాడు.

ట్రెండింగ్ వార్తలు