Bimbisara: బింబిసార, సీతా రామం.. అన్నగారికే క్రెడిట్!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతవారం రిలీజ్ అయిన బింబిసార, సీతా రామం చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ హీరోగా ‘సీతా రామం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.

Bimbisara: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గతవారం రిలీజ్ అయిన బింబిసార, సీతా రామం చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ హీరోగా ‘సీతా రామం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. అయితే ఇటీవల టాలీవుడ్‌లో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించేయడంతో, ఈ సినిమాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయా అనే సందేహం అందరిలో నెలకొని ఉండేది. కానీ.. సినిమాలో కంటెంట్ ఉంటే, ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారని ఈ రెండు సినిమాలు కూడా ప్రూవ్ చేశాయి.

Bimbisara: బింబిసార ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

ఇక ఈ రెండు సినిమాలు విభిన్నమైన నేపథ్యాలలో రావడం, రెండింటికీ ప్రేక్షకులు అదిరిపోయే సక్సెస్‌ను కట్టబెట్టడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఈ రెండు సినిమాలు నిలిచాయి. అయితే ఈ రెండింటి విజయం క్రేడిట్‌ను మాత్రం కొందరు ప్రేక్షకులు సీనియర్ ఎన్టీఆర్‌కు ఇచ్చేస్తున్నారు. దానికి ఓ బలమైన కారణం కూడా వారు చెబుతున్నారు. బింబిసార చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి రాగా, సీతా రామం చిత్రం వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి వచ్చింది. ఈ రెండు బ్యానర్స్‌లలో మనకు ఎన్టీఆర్ కనిపిస్తాడు.

Sita Ramam: ‘సీతా రామం’కు నో చెప్పిన స్టార్ బ్యూటీ.. ఎవరో తెలుసా?

దీంతో ఇప్పుడు ఈ రెండు సినిమాల సక్సెస్ క్రెడిట్ ఎన్టీఆర్‌కు ఇస్తున్నారు అభిమానులు. ఏదేమైనా టాలీవుడ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలు విజయం సాధించడం అందరికీ సంతోషంగా ఉందని ఆయా చిత్రాల దర్శకనిర్మాతలు అంటున్నారు. బింబిసార చిత్రాన్ని దర్శకుడు వశిష్ఠ తెరకకెక్కించగా, హను రాఘవపూడి ‘సీతా రామం’ను తెరకెక్కించాడు.

ట్రెండింగ్ వార్తలు