Venkaiah Retirement: మనవి రెండు భావజాలాలు కానీ..: వెంకయ్య రిటైర్మెంట్‭పై ఖర్గే

ప్రధాన రాష్ట్రాల్లో ఎగువ సభ ఉండాలని మీరొక నేషనల్ పాలసీని ప్రతిపాదించారు. అలాగే మహిళా బిల్లు, ఇతర సమస్యలపై ఏకాభిప్రాయం గురించి మీరు చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. మీరు వదిలిపెట్టిన ఆ అసంపూర్ణాన్ని ప్రభుత్వం పూర్తి చేస్తుందని నేను నమ్ముతున్నాను. మన ఇద్దిరిది రెండు భిన్న భావజాలాలు. నాకు మీపై కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి కూడా. కానీ ఈ సమయంలో వాటిని గుర్తు చేయదల్చుకోలేదు. అత్యంత కఠిన సమయంలో, అత్యంత ఒత్తిడితో మీరు మీ బాధ్యతలను కొనసాగించారు

Venkaiah Retirementఉపరాష్ట్రపతితో పాటు రాజ్యసభ చైర్మన్‭గా పదవీ విరమణ చేస్తున్న ఎం.వెంకయ్యనాయుడుకు సోమవారం రాజ్యసభలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సభా సభ్యులు ఆయనకు వీడ్కోలు పలుకుతూ వెంకయ్య పదవీ కాలాన్ని ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని, రాజ్యసభ చైర్మన్‭గా ఆయన పనితీరును గుర్తు చేసుకున్నారు. రాజ్యసభ విపక్ష పక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ వెంకయ్యతో భావజాలపరమైన బేధాభిప్రాయాలు ఉన్నప్పటికీ అతి కష్టకాలంలో రాజ్యసభ చైర్మన్‭గా తన బాధ్యత్యలు నిర్వర్తించారని అందుకు ధన్యవాదాలని ఖర్గే అన్నారు.

‘‘ప్రధాన రాష్ట్రాల్లో ఎగువ సభ ఉండాలని మీరొక నేషనల్ పాలసీని ప్రతిపాదించారు. అలాగే మహిళా బిల్లు, ఇతర సమస్యలపై ఏకాభిప్రాయం గురించి మీరు చాలాసార్లు మాట్లాడారు. కానీ ఇప్పటికీ అవి ఆచరణలోకి రాలేదు. మీరు వదిలిపెట్టిన ఆ అసంపూర్ణాన్ని ప్రభుత్వం పూర్తి చేస్తుందని నేను నమ్ముతున్నాను. మన ఇద్దిరివీ రెండు భిన్న భావజాలాలు. నాకు మీపై కొన్ని ఫిర్యాదులు ఉన్నాయి కూడా. కానీ ఈ సమయంలో వాటిని గుర్తు చేయదల్చుకోలేదు. అత్యంత కఠిన సమయంలో, అత్యంత ఒత్తిడితో మీరు మీ బాధ్యతలను కొనసాగించారు. అందుకు ధన్యవాదాలు’’ అని ఖార్గే అన్నారు.

వెంకయ్యనాయుడు ఈ నెల 10వ తేదీతో ఉపరాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి చేసుకుంటున్నారు. నూతన ఉపరాష్ట్రపతిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగ్‭దీప్ ధన్‭కర్ ఎన్నికయ్యారు. ఈ నెల 11న ఆయన ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనే రాజ్యసభ చైర్మన్‭గా కొనసాగనున్నారు.

Bangladesh Crisis : బంగ్లాదేశ్ లో శ్రీలంక పరిస్థితులు..52 శాతం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఆందోళనలతో దద్దరిల్లిన ఢాకా..

ట్రెండింగ్ వార్తలు