Koo: అమెరికాలో అడుగుపెట్టనున్న ‘కూ’.. ట్విట్టర్‌కు పోటీ ఇవ్వనున్న భారతీయ సంస్థ

ట్విట్టర్‌కు పోటీగా మన దేశంలో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’. ఇప్పటికే ఇండియాతోపాటు పలు దేశాల్లో మంచి ఆదరణ పొందుతున్న ఈ యాప్ సేవలు త్వరలో అమెరికాలో పూర్తి స్థాయిలో మొదలుకానున్నాయి.

Koo: దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’ త్వరలో అమెరికాలో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఇండియాలో మంచి ఆదరణ దక్కించుకున్న ఈ యాప్ త్వరలో ఇతర దేశాల్లో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాల్ని కంపెనీ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Elon Musk: ట్విట్టర్‌కు త్వరలో కొత్త సీఈవో.. పదవికి గుడ్ బై చెప్పనున్న ఎలన్ మస్క్

త్వరలోనే అమెరికాలో ‘కూ’ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఇది ట్విట్టర్‌లాగే మైక్రో బ్లాగింగ్ యాప్. 2020లో ఇండియాలో ప్రారంభమైంది. అనేక భాషల్లో, పలు దేశాల్లో అందుబాటులో ఉంది. ట్విట్టర్ ఉన్నప్పటికీ, దీనికి మన దేశంలో మంచి ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే ఈ యాప్‌ను 5 కోట్లకుపైగా వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ట్విట్టర్‌తో పోలిస్తే తక్కువే అయినప్పటికీ, ప్రపంచంలో అత్యధికంగా వాడుతున్న రెండో మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే. ట్విట్టర్‌ కాకుండా గెట్టర్, ట్రూత్ సోషల్, మాస్టోడాన్, పార్లర్ వంటి ప్లాట్‌ఫామ్స్ ఉన్నప్పటికీ, ‘కూ’ ట్విట్టర్ తర్వాత రెండో స్థానంలో నిలవడం విశేషం.

Lucknow: పేరెంట్స్-టీచర్ మీట్ ఏర్పాటు చేశారని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ప్రస్తుతం ట్విట్టర్ విషయంలో అనేక చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ‘కూ’ అక్కడ అడుగుపెడితే, ఆ సంస్థకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ట్విట్టర్ బర్డ్ నీలి రంగులో ఉంటే, కూ బర్డ్ పసుపు రంగులో ఉంటుంది. ఇందులో కూడా ప్రముఖ సెలబ్రిటీలకు ‘యెల్లో’ టిక్ ఉచితంగా ఇస్తోంది. దేశంలో చాలా మంది సెలబ్రిటీలు ‘కూ’ యాప్ వాడుతున్నారు. ప్రస్తుతం ఈ సంస్థ విలువ 260 మిలియన్ డాలర్లుగా ఉండవచ్చని అంచనా.

 

ట్రెండింగ్ వార్తలు