Site icon 10TV Telugu

Gold Rates: శ్రావణ మాసం వేళ పసిడి ప్రియులకు శుభవార్త.. పాతాళానికి పడిపోనున్న గోల్డ్ రేట్లు.. ఇవాళ తులం బంగారంపై ఎంత తగ్గిందంటే..?

Gold

Gold

Gold Rates: శ్రావణ మాసం ప్రారంభమైంది.. ఇదే సమయంలో బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త వచ్చింది. మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన గోల్డ్ రేట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వచ్చే వారం రోజుల్లో గోల్డ్ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గురువారం తులం బంగారంపై రూ.1360 తగ్గగా.. శుక్రవారంసైతం గోల్డ్ రేటు తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.490 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గింది. దీంతో రెండు రోజుల్లోనే 10గ్రాముల గోల్డ్ రేటు సుమారు రూ.1900 తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై ఎనిమిది డాలర్లు తగ్గింది.. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,361 డాలర్ల వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండి రేటు స్థిరంగా కొనసాగుతుంది.

గ్లోబల్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం.. అమెరికన్ డాలర్ విలువ పెరగడం, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం గోల్డ్ ధరలపై నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతాయి. అయితే, మీడియం టర్మ్‌లో సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు తగ్గడం, రిటైల్ పెట్టుబడుల డిమాండ్ తగ్గడం వల్ల గోల్డ్ ధరలు వచ్చే వారం రోజుల్లో భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆరేళ్లలో గోల్డ్ రేటు ఎంత పెరిగిందంటే..
గత ఆరేళ్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2019 మే నెలలో 10గ్రాముల బంగారం ధర రూ.30వేలు ఉండగా.. ప్రస్తుతం (జులై 2025) తులం గోల్డ్ రేటు రూ.లక్ష దాటేసింది. కేవలం ఆరేళ్ల కాలంలో బంగారం ధర దాదాపు రూ.70వేలు అంటే.. 200శాతానికి పైగా పెరిగింది. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఈ నెలాఖరు నాటికి గోల్డ్ రేటు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా తగ్గింది.
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.93,100కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,00,480కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,250కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,00,630కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,100 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,00,480కు చేరింది

వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,28,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,18,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,28,00 వద్ద కొనసాగుతుంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

Exit mobile version