Site icon 10TV Telugu

Most Wanted Fugitives : అమెరికా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో భారతీయుడు.. ఎవరీ భద్రేష్‌కుమార్ పటేల్.. రూ. 2 కోటి రివార్డు..!

Who is Bhadreshkumar patel

Who is Bhadreshkumar patel

Most Wanted Fugitives : అమెరికా ఒక భారతీయ యువకుడి కోసం వెతుకుతోంది. అతన్ని పట్టిస్తే రూ. 2 కోట్ల రివార్డ్ కూడా ఆఫర్ చేసింది. అతిపెద్ద విషయం ఏమిటంటే.. ఈ భారతీయుడు ఇప్పుడు అమెరికన్ (FBI) మోస్ట్ వాంటెడ్ టాప్ టెన్ లిస్టులో ఒకడు. ఇంతకీ ఆ భారతీయుడు ఎవరు? అమెరికా అతన్ని పట్టుకుంటే ఎందుకు అంతగా భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తోంది. అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎఫ్‌బీఐ అతన్ని ఎందుకు అరెస్టు చేయాలనుకుంటుంది? అతడి పేరు ఏమిటి? చేసిన నేరం ఏంటి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Read Also : HMPV Virus : ప్రపంచవ్యాప్తంగా హెచ్ఎంపీవీ వైరస్ విజృంభణ.. బంగ్లాదేశ్‌లో మొదటి మరణం!

32 ఏళ్ల గుజరాతీ పటేల్ గాలిస్తున్న అమెరికా:
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) టాప్ 10 జాబితాలో చేర్చిన పారిపోయిన భారతీయుడి పేరు భద్రేష్ కుమార్ పటేల్.. ఇతడి కోసమే అమెరికా చాలాకాలంగా వెతుకుతోంది. భద్రేష్ అమెరికా, భారత్‌లో మోస్ట్ వాంటెడ్ వ్యక్తి. 32 ఏళ్ల గుజరాతీకి చెందిన పటేల్.. ఏప్రిల్ 2015లో మేరీల్యాండ్‌లోని ఒక డోనట్స్ షాపులో పనిచేస్తున్న తన భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు. హత్య తర్వాత నిందితుడు పటేల్ పరారయ్యాడు. ఈ కేసులో ఎఫ్‌బీఐ టాప్ 10 మోస్ట్ వాంటెడ్ పరారీలో ఉన్న జాబితాలో చేర్చింది.

నిందితుడి ఆచూకీ చెబితే రూ. కోట్ల వరకు రివార్డ్ :
భద్రేష్‌కుమార్ పటేల్‌ను అరెస్టు చేసేందుకు ఎఫ్‌బీఐ తీవ్రంగా గాలిస్తోంది. ఈ నిందితుడి ఆచూకీ గురించి ఏదైనా సమాచారం ఇచ్చినవారికి ఫెడరల్ ఏజెన్సీ 250,000 డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది. డోనట్ షాప్‌లో పని చేస్తున్నప్పుడు తన భార్యను హత్య చేశాడనే నేరారోపణలు ఎదుర్కొంటున్నాడు.

భద్రేష్‌కుమార్ పటేల్ ఎవరు? అభియోగాలేమిటి? :
2015లో మేరీల్యాండ్‌లోని హనోవర్‌లోని డంకిన్ డోనట్స్‌లో పనిచేస్తున్నప్పుడు భద్రేష్‌కుమార్ పటేల్ తన భార్య పాలక్‌ను హత్య చేశాడు. తన భార్యను షాపు వెనుక గదిలో వంటగది కత్తితో అనేకసార్లు పొడిచి హత్యచేశాడు. కస్టమర్ల ముందు రాత్రి షిఫ్ట్ సమయంలో జరిగిన ఈ దారుణ ఘటన సీసీకెమెరాకు చిక్కింది.

ఆ వీడియోలో 24ఏళ్ల భద్రేష్‌కుమార్, 21ఏళ్ల అతని భార్య హత్యకు ముందు వంటగదికి వెళ్లడం కనిపించింది. దుకాణంలో ఉద్యోగులెవరూ కనిపించకపోవడంతో కస్టమర్లు పోలీసులకు సమాచారం అందించగా భార్య పాలక్ హత్యకు గురైనట్లు తెలిసింది. భద్రేష్‌కుమార్ ఉద్దేశపూర్వకంగా ఒక బలమైన ఆయుధంతో దారుణంగా హత్యచేశాడంటూ అనేక తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొన్నాడు.

భద్రేష్‌కుమార్, భార్య పాలక్ మధ్య వివాదం ఏంటి? :
భార్య పాలక్ హత్యకు నెల రోజుల ముందు దంపతుల వీసా గడువు ముగియనున్నందున తిరిగి భారత్‌కు రావాలనుకున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. పాలక్ అమెరికాకు రావడాన్ని వ్యతిరేకించగా, భద్రేష్‌కుమార్ అక్కడే ఉండాలని కోరుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

భద్రేష్‌కుమార్ కోసం 2015 నుంచి అమెరికా గాలింపు :
ఏప్రిల్ 2015లో బాల్టిమోర్‌లోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ పటేల్ ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోవడంతో అరెస్టుకు వారెంట్ జారీ చేసింది. ‘‘న్యూజెర్సీ హోటల్ నుంచి నెవార్క్ రైలు స్టేషన్‌కు క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా చివరిసారిగా కనిపించిన పటేల్ ప్రమాదకరమైన ఆయుధాలు కలిగి ఉన్నాడని, అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడాలి’’ అని ఎఫ్‌బీఐ ప్రకటనలో పేర్కొంది. ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ గోర్డాన్ జాన్సన్ ప్రకారం.. భద్రేష్‌కుమార్ పటేల్ చాలా హింసాత్మక నేరాలకు పాల్పడ్డాడు. దాంతో నిందితుడిని టాప్ టెన్ జాబితాలో చేర్చారు.

Read Also : Russian Ukraine War : ఉక్రెయిన్‌తో వార్.. రష్యా ఆర్మీలో పోరాడే 12 మంది భారతీయులు మృతి.. 16 మంది మిస్సింగ్..!

Exit mobile version