Site icon 10TV Telugu

CTET Answer Key 2024 : సీటెట్ ఆన్సర్ కీ 2024 అభ్యంతరాలకు లాస్ట్ డేట్ ముగుస్తోంది.. ఇప్పుడే రిజల్ట్స్ అప్‌డేట్ చెక్ చేయండి!

CTET Answer Key 2024

CTET Answer Key 2024

CTET Answer Key 2024 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) డిసెంబర్ 2024కు సంబంధించి జనవరి 5, 2025న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాల విండోను క్లోజ్ చేస్తుంది.

అధికారిక వెబ్‌సైట్‌ (ctet.nic.in)ను విజిట్ ద్వారా ఆన్సర్ కీలో అభ్యంతరాలను లేవనెత్తవచ్చు. ఆన్సర్ కీని యాక్సెస్ చేసే అభ్యర్థులు వారి రోల్ నంబర్, పుట్టిన తేదీని రిజిస్టర్ చేసుకోవాలి. ప్రతి అభ్యర్థనకు రూ. వెయ్యి రుసుము వసూలు చేయనున్నట్టు అభ్యర్థులు గమనించాలి.

Read Also : CMR College Girls Hostel : సీఎంఆర్‌ కాలేజీ గర్ల్స్ హాస్టల్ ఘటన కేసులో కీలక పరిణామం.. ఇద్దరు బిహారీలు అరెస్ట్..!

ఈ అభ్యంతరాలను నిపుణుల బృందం పరిశీలిస్తుంది. ఆన్సర్ కీలో ఏదైనా పొరపాటు గుర్తిస్తే.. అవసరమైన దిద్దుబాట్లు చేస్తారు. సంబంధిత రుసుము రీఫండ్ చేస్తారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన తర్వాత బోర్డు ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేస్తుంది. దాని ఆధారంగా సీటెట్ పరీక్ష ఫలితాలను ప్రకటిస్తుంది.

కచ్చితమైన ఫలితాల తేదీ, సమయాన్ని సీబీఎస్ఈ ఇంకా ప్రకటించలేదు. ఇంకా, సీటెట్ ఆన్సర్ కీ, ఓఎంఆర్ షీట్ ఉపయోగించి, అభ్యర్థులు తమ సంభావ్య స్కోర్‌ను అంచనా వేయవచ్చు. అలా చేసేందుకు తప్పనిసరిగా మార్కింగ్ స్కీమ్ తెలుసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ లేదు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు ఉంటుంది.

సీటెట్ ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? :

సీటెట్ ఆన్సర్ కీ 2024 : అభ్యంతరాన్ని ఎలా తెలపాలి? :

సీటెట్ డిసెంబర్ 2024 పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించారు. పేపర్ II ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం వరకు, పేపర్ I సాయంత్రం షిఫ్టులో మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. పేపర్ I అనేది 1 నుంచి 5 తరగతులకు బోధించాలనుకునే అభ్యర్థులకు పేపర్ II అనేది 6 నుంచి 8 తరగతులకు బోధించాలనుకునే దరఖాస్తుదారుల కోసం నిర్వహిస్తారు.

Read Also : Jharkhand Cold Wave : జార్ఖండ్‌లో చలిపంజా.. 8వ తరగతి వరకు అన్ని స్కూళ్లు మూసివేత.. ఎప్పటినుంచంటే?

Exit mobile version