చదువు కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించనున్నారు అధికారులు. జులై 28న భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఎంఎస్ఎన్ లాబరేటరీ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా జరుగనుంది. ఈమేరకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి బి.వెంకన్న అధికారిక ప్రకటన చేశారు. కాబట్టి జిల్లాలోని నిరుద్యోగులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విద్యార్థత:
2024-25 సంవత్సరంలో ఇంటర్ ఎంపీసీ, బైపిసి, ఫార్మాటెక్, ఎంఎల్టి కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరు ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అలాగే, విద్యార్థులు పదవ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో తప్పకుండా 50% మార్కులు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
అభ్యర్థుల వయసు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం:
ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 వేల జీతం అందుతుంది.
అవసరమైన ధ్రువపత్రాలు:
అభ్యర్థులు విద్య అర్హత సర్టిఫికెట్ల, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలు తీసుకుని రావాల్సి ఉంటుంది.
జాబ్ మేళా వేదిక, సమయం:
జులై 28 భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది.
అలాగే పై చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు డిగ్రీ చదువుకునే వెసులుబాటు కూడ కల్పిస్తున్నారు. కాబట్టి, ఓపక్క పని చేసుకుంటూనే మరోపక్క చదువుకునే అవకాశాన్నీ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని యువత తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మరిన్ని వివరాల కోసం ఈ 8142194787 నంబర్ ను సంప్రదించవచ్చు.