Site icon 10TV Telugu

Ginger Oil Benefits : అల్లం అయిల్ తో ఆరోగ్యానికి ఎంతో మేలు! బరువు తగ్గించటంతోపాటు మరెన్నో ప్రయోజనాలు

ginger oil benefits

ginger oil benefits

Ginger Oil Benefits : జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచటంలో అల్లం ఆయిల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. కడుపు నొప్పి, అజీర్ణం, విరేచనాలు, పేగు నొప్పి మరియు వాంతులకు నివారించటంలో ఉత్తమమైన సహజ నివారణలలో ఒకటిగా అల్లం ఆయిల్ ను చెప్పవచ్చు. బరువు తగ్గించడంలో అల్లం నూనె ప్రభావవంతంగా పని చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు లేదా మూడు చుక్కల అల్లం నూనెను యాడ్ చేసుకుని సేవించాలి. ఇలా ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే గ‌నుక‌. శరీరంలో పేరుకు పోయిన టాక్సిన్స్ మరియు అదనపు కొవ్వు తొలిగి పోతుంది. అతి ఆక‌లి దూరంగా అవుతుంది. త‌ద్వారా క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతాయి.

అల్లం ఎసెన్షియల్ ఆయిల్ ట్రీట్‌మెంట్ అల్సర్‌లను 85% నిరోధిస్తుంది. అల్లం నూనెను తీసుకున్న తర్వాత నెక్రోసిస్, ఎరోషన్, గ్యాస్ట్రిక్ వాల్ యొక్క రక్తస్రావం వంటి ఇథనాల్ ప్రేరిత గాయాలు గణనీయంగా తగ్గాయని పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ ఆయిల్ ను ముక్కు ద్వారా పీల్చినప్పుడు వికారం తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. శస్త్రచికిత్స తర్వాత వికారం నిరోధక మందుల అవసరం కూడా తగ్గుతుంది. ఊపిరితిత్తుల నుండి శ్లేష్మాన్ని తొలగించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. జలుబు, ఫ్లూ, దగ్గు, ఆస్తమా వంటి వాటికి సహజ నివారణిగా ప్రసిద్ధి చెందింది.

అంటువ్యాధులను నయం చేయటంతోపాటు, జెర్మ్స్‌ను చంపే చర్యను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని యాంటిసెప్టిక్‌గా ఉపయోగించవచ్చు. అల్లం నూనెను నోటి ద్వారా తీసుకున్నప్పుడు, పేగు ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి వాటి నుండి రక్షణగా పనిచేస్తుంది. ఇక ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో మూడంటే మూడు చుక్క‌లు అల్లం నూనె క‌లిపి సేవిస్తే జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది. గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

ఒక గిన్నెలో బాగా వేడి నీటిని తీసుకుని. అందులో నాలుగు చుక్క‌లు అల్లం నూనెను వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, శ్వాస కోశంలో వాపు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ మరియు చర్మ క్యాన్సర్ యొక్క చెడు ప్రభావాలను ఎదుర్కోవడంలో అల్లం నూనె అదేవిధంగా ప్రభావవంతంగా ఉంటుంది. అల్లం నూనె ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాలతో పోరాడటానికి సహాయపడుతుంది. అల్లం నూనె వయస్సు సంబంధిత ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది.

 

Exit mobile version