Site icon 10TV Telugu

Smiley Chef : హెలికాప్టర్ లో ఎగురుతూ ఉల్లిపాయలు భలే కట్ చేశాడే

Smiley Chef cuts onion aboard a flying vehicle

Smiley Chef Burak Ozdemir : ఇంట్లో కూరకు నాలుగు ఉల్లిపాయలు కోయాలంటే చాలు కళ్లమ్మటా నీళ్లు బొటబొటా కారిపోతాయి. అదే ఆకాశంలో తేలుతూ..గాలి విసిరికొడుతుంటే ఉల్లిపాయలు కట్ చేయటం అంటే మాటలు కాదు. కానీ అస్సులు ఉల్లిపాయల వంకే చూడండా హెలికాప్టర్లో కూర్చొని ఉల్లిపాయలు కసకసా కోసేసాడు ఓ షెఫ్. టర్కీకి చెందిన ఫేమస్ షెఫ్ ‘బురాక్ ఓజ్డెమిర్’ గురించి సోషల్ మీడియా యూజర్లు తెలుసు. ఇతని వీడియోలు చాలా ఫేమస్.ముద్దుగా ‘స్మైలీ చెఫ్’ అని కూడా పిలుస్తారు. స్మైలీ ఫేస్‌తో కెమేరా వైపే చూస్తూ చకచకా వంటలు చేసే ఇతగాడి వీడియోలకు ఎంతోమంది వ్యూయర్స్ ఉన్నారు.

ఎప్పుడైనా సరే ఉల్లిపాయలను కోయడం పెద్ద టాస్కే అని చెప్పాలి. ఒక చోటే నిలబడి కోయటమంటేనే కళ్లల్లోంచి నీళ్లు బొటబొటా కారిపోతాయి. అటువంటిది కదులుతున్న వాహనాల్లో ఉల్లిగడ్డలను కోయడం అంటే ఇక అటూ ఇటూ కదిలిపోతూ అస్సలు కోయలేం. పైగా గాల్లో ఎగిరే హెలికాప్టర్లో? ఉల్లిపాయల్ని కసాకసా కోసేసి మరోసారి వైలర్ అయిపోయాడు ఈ స్మైలీ షెఫ్ ‘బురాక్ ఓజ్డెమిర్’.

కనీసం ఉల్లిపాయల వైపు కూడా చూడకుండా కెమేరా వైపే చూస్తూ..కోసి పారేశాడు. గాలికి ఉల్లిపాయ ముక్కలు ఎగిరిపోతున్నా పట్టించుకోలేదు. ఈ వీడియో తన ఇన్‌‌స్టాగ్రామ్ పేజీలో ‘‘ఎగిరే ఉల్లిపాయలంటే మీకు ఇష్టమా’’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేయటంతో అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version