Site icon 10TV Telugu

Ashish Gandhi – Nikitha : నిఖితను పెళ్లాడిన నటుడు ఆశిష్‌ గాంధీ..

Ashish Gandhi Nikitha

Ashish Gandhi Nikitha

Ashish Gandhi – Nikitha: నటుడు ఆశీష్‌ గాంధీ ఓ ఇంటివాడయ్యారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నికితతో ఆశిష్‌ ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. కోవిడ్‌ నియమ నిబంధనల నేపథ్యంలో అతి కొద్ది మంది బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే ఆశిష్, నిఖిలత వివాహం జరిగింది.

రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో అశిష్, నికితల పెళ్లి జరిగింది. గత నవంబరులో ఆశిష్‌ తల్లిండ్రులు నిఖిత కుటుంబసభ్యులను కలిశారు. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకున్న తర్వాత పెళ్లి విషయమై ఆశిష్, నిఖితలను మాట్లాడుకోవాల్సిందిగా కోరారు. పెద్దల మాట ప్రకారం నిఖితతో మాట్లాడటానికి వెళ్లిన ఆశిష్‌కు ఆనందంతో కూడిన ఆశ్యర్యకరమైన విషయాలు తెలిశాయి.

‘‘రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌లో నన్ను చూసి నిఖిత ఇష్టపడింది. అప్పట్నుంచి మా ఫ్యామిలీ ఫంక్షన్స్‌ జరిగిన ప్రతిసారి నన్ను గమనిస్తూనే ఉంది. ఫాలో చేస్తూనే ఉంది. అంటే తను అప్పట్నుంచే నన్ను ప్రేమిస్తుంది. ఈ విషయాలను నిఖిత నాతో చెబుతున్నప్పుడు నాకు చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది’’ అని పేర్కొన్నారు ఆశిష్‌. అలాగే ఆశిష్‌తో వివాహం గురించి తన ఇంట్లోని పెద్దలు మాట్లాడుకుంటున్నప్పుడు నిఖిత చాలా థ్రిల్‌ అయ్యారు. కోరుకున్న వ్యక్తితోనే పరిణయం కాబోతున్నందుకు అప్పట్లో ఫుల్‌ హ్యాపీగా ఫీలయ్యారు.

‘‘నేను కోరుకున్న లక్షణాలు ఉన్న అమ్మాయి నా జీవితంలోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తను నా వ్యక్తితగతమైన విషయాలను బాగా అర్థం చేసుకుంటుంది. సాధారణంగా సినిమా లైఫ్‌ అంటే చాలా మందికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అందుకే తనతో నా వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చర్చించాలనుకున్నాను. తను బాగా అర్థం చేసుకుంది. చాలా మెచ్యూర్డ్‌‌గా ఆలోచిస్తుంది’’ అని పేర్కొన్నారు ఆశిష్‌ గాంధీ..

Exit mobile version