Site icon 10TV Telugu

Janhvi Kapoor : ఇండస్ట్రీకి వస్తా అంటే అమ్మ వద్దు అనేది.. సినిమా వాళ్ళ జీవితం సౌకర్యంగా ఉండదు అని చెప్పేది..

Janhvi Kapoor remember her mother sridevi

Janhvi Kapoor remember her mother sridevi

Janhvi Kapoor :  శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తనపై శ్రీదేవి కూతురు అవ్వడంతో చాలా అంచనాలు ఉన్నాయి. ఎక్కువగా కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా ప్రయోగాత్మక సినిమాలతో నిదానంగా కెరీర్ ని బిల్డ్ చేసుకుంటుంది జాన్వీ. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జాన్వీ తన తల్లి శ్రీదేవిని తలుచుకొని ఎమోషనల్ అయింది.

జాన్వీ మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇస్తాను అన్నప్పుడు మా అమ్మ ఒప్పుకోలేదు. నువ్వు ఏ ఫీల్డ్ లోకి అయినా వెళ్లు, సినీ పరిశ్రమలోకి మాత్రం అడుగుపెట్టొద్దు అని చెప్పింది. నా జీవితం మొత్తం సినీ పరిశ్రమలోనే గడిచిపోయింది. ఎన్నో ఏళ్లు కష్టపడి మీకు ఇలాంటి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకున్నట్లు సినిమా వాళ్ళ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. నీకు ఆ రంగంలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అని చెప్పింది.”

Rashmika Mandanna : హీరోయిన్ గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి కూడా రెడీ.. బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయి..

”కానీ నేను దానికి ఒప్పుకోలేదు. నేను హీరోయిన్ అవుతాను అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. చివరికి నా ఇష్టానికి ఓకే చెప్పింది మా అమ్మ. ఇండస్ట్రీకి వచ్చేముందు.. నువ్వు చాలా సెన్సిటివ్, ఇండస్ట్రీలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు, అవన్నీ విని పట్టించుకోకూడదు. నీ ప్రతి సినిమాని నా 300 సినిమాలతో పోల్చి చూస్తారు. అలాంటివి నువ్వు తట్టుకోగలగాలి అని చెప్పింది. నా గురించి ప్రతి క్షణం జాగ్రత్త తీసుకునేది మా అమ్మ” అంటూ శ్రీదేవిని తలుచుకొని ఎమోషనల్ అయింది.

Exit mobile version