Site icon 10TV Telugu

G N Rangarajan : లెజెండరీ డైరెక్టర్ – ప్రొడ్యూసర్ జి.ఎన్. రంగరాజన్ మృతి..

G N Rangarajan

G N Rangarajan

G N Rangarajan: శ్రీ ‘కలైమామణి’ పట్రాయని సంగీత రావు గారు 101 సంవత్సరాల వయసులో కరోనా బారినపడి చెన్నైలో బుధవారం రాత్రి 9 గంటలకు పరమపదించారనే వార్త మర్చిపోకముందే మరో ప్రముఖ వ్యక్తి మృతి చెందడంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది..

Patrayani Sangeeta Rao : ‘కలైమామణి’ పట్రాయని సంగీత రావు గారు ఇకలేరు..

సీనియర్ తమిళ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ జి.ఎన్. రంగరాజన్ గరువారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యలతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

విశ్వ నాయకుడు కమల్ హాసన్ తో ‘మీండుం కోకిల’, ‘కళ్యాణరామన్’ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు రంగరాజన్. ఆయన మరణించారనే వార్తను రంగరాజన్ కొడుకు, దర్శకుడు జి.ఎన్.ఆర్ కుమారవేలన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పలువురు కోలీవుడ్ సినీ ప్రముఖులు రంగరాజన్‌కు నివాళులర్పిస్తున్నారు.

Exit mobile version