Site icon 10TV Telugu

Kara Master : కాళీపట్నం రామారావు మృతి తెలుగు సాహితీ రంగంలో పూడ్చలేని లోటు – మెగాస్టార్ చిరంజీవి..

Kara Master

Kara Master

Kara Master: సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడుగా గుర్తింపు పొందిన కారా మాస్టారు రామారావు మృతి తెలుగు సాహితీ రంగంలో పూడ్చ లేని లోటు అన్నారు మెగాస్టార్ చిరంజీవి..

‘‘తన అద్భుతమైన కథలతో.. తెలుగు సాహితీ రంగాన్ని సుసంపన్నం చేసి, తెలుగు కథకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు ప్రముఖ రచయత కాళీపట్నం రామారావు గారు.. ఆయన మృతి చెందడం తెలుగు సాహితీ రంగంలో పూడ్చ లేని లోటు.. కథానిలయం స్థాపించి, తెలుగు కథకు ఆయన చేసిన సేవ అజరామరం.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం’’.. అంటూ చిరు ట్వీట్ ద్వారా నివాళి అర్పించారు.

కారా మాస్టారు జీవిత విశేషాలు..
1924 నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లా పొందూరులో జన్మించిన కారా మాస్టారు (కాళీపట్నం రామారావు)
ఎస్.ఎస్.ఎల్.సీ వరకూ శ్రీకాకుళంలోనే చదివారు.
విశాఖ జిల్లా భీమిలిలో సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ స్కూల్లో టీచర్‌గా ట్రైనింగ్ అయ్యారు..
1948 నుంచి 31 ఏళ్ల పాటు ఒకే ఎయిడెడ్ హైస్కూల్లో ఒకే స్థాయిలో ఉద్యోగం చేశారు..

కారా మాస్టారు రాసిన తొలి కథానిక ‘చిత్రగుప్త’..
‘చిత్రగుప్త’ సంతృప్తినివ్వకపోవడంతో 1955లో కథలు రాయడం ఆపేశారు.. 1963 నుంచి తిరిగి కథలు రాయడం ప్రారంభించారు..
ఆయన రాసిన ‘యజ్ఞం’ నవలకు విశేషమైన గుర్తింపు రావడమే కాకుండా 1995 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు కారా మాస్టారు..
1997లో శ్రీకాకుళంలో కథానిలయాన్ని ఏర్పాటు చేశారు..
కారా మాస్టారు రాసిన కథానికలు – యజ్ఞం, తీర్పు, మహదాశీర్వచనం, వీరుడు -మహావీరుడు, ఆదివారం, హింస, నో రూమ్, స్నేహం, ఆర్తి, భయం, శాంతి, చావు, జీవినధార, కుట్ర.. కుట్ర కథానిక తర్వాత రాయడం ఆపేశారు కారా మాస్టారు..

Exit mobile version