Jagapathi Babu : టాలీవుడ్ నటుడు జగపతిబాబు తన ఆస్తులపై వస్తున్న వార్తలకు వెటకారంగా బదులిచ్చాడు. సినీపరిశ్రమకి నిర్మాత కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన జగ్గూ భాయ్.. నటుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హీరోగా, సహాయనటుడిగా తెలుగులో ఎన్నో సినిమాలో నటించిన రాని ఫేమ్, విల్లన్ గా మారిన తరువాత తెచ్చిపెట్టింది. మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన ‘లెజెండ్’ సినిమాలో తన విలనిజానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
Jagapathi Babu : నేను రాజకీయాలకు పనికిరాను.. రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేదు..
ఆ తరువాత వచ్చిన రంగస్థలం, అరవింద సమేత వీరరాఘవ సినిమాలలో విల్లన్ గా ప్రేక్షకులకు భయం కలిగించాడు. అయితే జగపతిబాబు ఒక నిర్మాత కుటుంబం నుంచి రావడం, అయన కూడా హీరోగా, విల్లన్ గా ఎన్నో సినిమాలు చేయడంతో.. అయన సంపాదన మరియు ఆస్తులపై గత కొన్ని రోజులుగా చర్చ నడుస్తుంది. ఈ విషయమై జగ్గూ భాయ్ ఎన్నోసారులు బదులిచ్చాడు.
కానీ ఆ ప్రశ్నలు మాత్రం ఎదురవ్వడం మానలేదు. దీంతో విసుగిపోయిన జగ్గూ భాయ్ వారందరికి కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు. తన ఇంటిలో ‘సాయి బాబా’ విగ్రహానికి పూజా చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. “దేవుడా, అందరూ నా దగ్గర ఉందనుకుంటున్న డబ్బుని నాకు ఇచ్చేయి. వాళ్లకి సమాధానం చెప్పలేక చస్తున్నా” అంటూ వ్యంగంగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ నటుడు నార్త్ టూ సౌత్ వరుస సినిమాలు చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు.
Devuddaa…Andharu naa daggara undhanukuntuna dabbu naaku iccheyi…cheppaleka Chastuna. pic.twitter.com/mGpe9D4Ty5
— Jaggu Bhai (@IamJagguBhai) November 13, 2022