Site icon 10TV Telugu

ఎన్టీఆర్ న్యూ లుక్: మరో యాడ్‌లో యంగ్ టైగర్

Jr NTR as Brand Ambassador for OTTO

ఇప్పటి వరకు పలు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా అదరగొట్టిన తారక్, మొట్టమొదటిసారి ఓటో మెన్స్ వేర్ బ్రాండ్‌కి ప్రమోటర్‌గా వ్యవహరించనున్నాడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అకౌంట్‌లో సరికొత్త బ్రాండ్ వచ్చి చేరింది. ఇప్పటి వరకు పలు బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా అదరగొట్టిన తారక్, మొట్టమొదటిసారి ఓటో మెన్స్ వేర్ బ్రాండ్‌కి ప్రమోటర్‌గా వ్యవహరించనున్నాడు. ‘నా సినిమాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, నేను నా డ్రెస్సింగ్ స్టైల్‌కి కూడా అంటే ఇంపార్టెన్స్ ఇస్తాను. పంచెలతో మొదలై, బెల్ బాటమ్ జీన్స్ దాకా, ఖుర్తాలతో మొదలై, షర్టులు, టీ-షర్టుల దాకా.. ఇలా, ఈ 24th సెంచరీ వరకూ ఎన్నో స్టైల్స్ అప్ గ్రేడ్ అవుతూ వచ్చాయ్.

స్టైల్ ఏదైనా మనకి పర్ఫెక్ట్‌గా సూటయ్యే బట్టలు వేసుకుని అద్దం ముందు నిలబడినప్పుడు ఆ ఫీలింగే వేరు. అలాంటి ఫీలింగ్ మీక్కూడా కావాలా? అయితే ఓటో మెన్స్ వేర్‌ని సెలెక్ట్ చేసుకోండి’.. అంటూ ఎన్టీఆర్, రకరకాల గెటప్స్‌లో, డిఫరెంట్ స్టైల్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి దర్శకత్వంలో తారక్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో స్టార్ట్ కానుంది.

వాచ్ వీడియో..

Exit mobile version