Site icon 10TV Telugu

ఎన్టీఆర్ క్రేజ్: అభిమానిగా మారిన కన్నడ స్టార్ హీరో

No Boundaries Craze: NTR is Rakshit Shetty’s favorite star!

జూనియర్ ఎన్టీఆర్.. వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ క్రేజ్ క్రియేట్ చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్నారు. ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఇప్పటికే పలు ఇండస్ట్రీల నటులు చెబుతుండడం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్‌గా కన్నడ స్టార్ హీరో, దర్శకుడు రక్షిత్ శెట్టి ఎన్టీఆర్‌కు తాను వీరాభిమానిని అని ప్రకటించాడు.

కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటిస్తోన్న తాజా చిత్రం ‘అవనే శ్రీమన్నారాయణ’ను తెలుగులో ‘అతడే శ్రీమన్నారాయణ’. ఇందులో షాన్వి శ్రీవాస్తవ హీరోయిన్. సచిన్ దర్శకత్వంలో బాలాజి మనోహర్, అచ్యుత కుమార్, ప్రమోద్ శెట్టి, మధుసూధన్ రావు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ప్యాన్ ఇండియా గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు రక్షిత్ శెట్టి.  “నాకు స్టార్‌గా ఎన్టీఆర్ అంటే ఇష్టం. తెరపై ఆయనను చూస్తుంటే ఇన్స్‌పైరింగ్‌గా ఉంటుందని అన్నారు. అందుకే ఎన్టీఆర్‌కు అభిమానిని అయిపోయా” అని చెప్పారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ రష్మిక మందన్నతో నిశ్చితార్థం చేసుకుని తర్వాత బ్రేక్ అయ్యి రక్షిత్ శెట్టి అప్పట్లో వార్తల్లో నిలిచాడు.

Exit mobile version