Site icon 10TV Telugu

తొలి అడుగు నుంచి తోడున్నాడు.. : ఫ్యాన్ మరణంపై ఎన్టీఆర్ కన్నీళ్లు

NTR Press Note About His Fan Death

తన అభిమాని మరణవార్త తెలియగానే ఎన్టీఆర్ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు తారక్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి మాస్‌లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ఎన్టీఆర్ అభిమాని ఒకతను మరణించాడు. తన అభిమాని మరణవార్త తెలియగానే ఎన్టీఆర్ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. 

“నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణ జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. “నిన్ను చూడాలని” చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు.

నటుడి గా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు.

జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రఘాఢమైన సానుభూతిని తెలుపుతున్నాను.” ఫేస్‌బుక్ ద్వారా పోస్ట్ చేశారు ఎన్టీఆర్.

అభిమానులే సర్వస్వం అంటూ అనేక సంధార్భాల్లో చెప్పిన ఎన్‌టీఆర్ ఫ్యాన్ చనిపోగానే స్పందిస్తూ.. చాలా ఎమోషనల్‌గా తన అభిమానిని ఉద్దేశించి ఫేస్‌బుక్ ద్వారా పోస్ట్ చేయడం గమనార్హం. ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version