Site icon 10TV Telugu

Dengue in Delhi : ఢిల్లీపై డెంగ్యూ పంజా .. రోజురోజుకు పెరుగుతున్న కేసులు, ఆందోళనలో ప్రజలు

dengue in delhi

dengue in delhi

Dengue cases in Delhi : ఢిల్లీ నగరంతో పాటు యమునా నదీ పరివాహక ప్రాంతాల్లో ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు నది నగారాన్ని భయపెట్టింది.ఏ క్షణాన్ని నగరాన్ని ముంచేస్తుందోననే ఆందోళన నుంచి ఢిల్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కాస్త ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో ముప్పు వచ్చి పడింది ఢిల్లీ నగరవాసులకు.యమునాన నదికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈక్రమంలో ఢిల్లీ నగరంలో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగ్యు జ్వరాలతో జనాలు నానా పాట్లు పడుతున్నారు.

వరద ముప్పు తప్పినా డెంగ్యు కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. పారిశుద్ద్య సమస్యలు తలెత్తుతుండటంతో డెంగ్యు జ్వరాల బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు 187 డెంగ్యు కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకు పెరుగుతున్న డెంగ్యు కేసులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరదల వల్ల నీరు కలుషితం కావటంతో పాటు పలు రకాల పారిశుద్ద్య సమస్యలు రావటంతో బాధితుల సంఖ్య పెరుగుతోంది.

జులై 22 వరకు ఢిల్లీలో 187 డెంగ్యు కేసులు, 61 మలేరియా కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో డెంగ్యూ, మలేరియా కేసులు పెరిగే అవకాశం ఉందని..దోమల ఉత్పత్తిని అరికట్టాలని, వరద నీటిలో పడిన బురదను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించామని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ ఇటీవల తెలిపారు.

పరిస్థితి ఇలా ఉంటే ఢిల్లీలోని మున్సిపల్ కార్మికులు సమ్మె హుకుం జారీ చేశారు.తమ డిమాండ్లు నెరవేర్చకపోతే జుల 31 నుంచి సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కమిషనర్ కు సమ్మె నోటీసు ఇచ్చారు.వారి డిమాండ్లు పరిశీలిస్తామని ఢిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ మున్సిపల్ కార్మికులకు హామీ ఇచ్చారు. వరదలతో అతలాకుతలంగా మారిన క్రమంలో అంటువ్యాధులు ప్రబలుతుంటాయని ఇటువంటి పరిస్థితుల్లో సమ్మె చేయటం సరికాదని సూచించారు. కార్మికుల డిమాండ్లు పరిశీలిస్తామని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా సమ్మెకు పిలుపునిచ్చివారిలు3,000మంది డెంగ్యు బ్రీడింగ్ చెక్కింగ్ కార్మికులు, 2,000మంది ఫీల్డ్ వర్కర్లు ఉన్నారు.

Exit mobile version