Site icon 10TV Telugu

Pepper Fry CEO Ambarish Murthy : గుండెపోటుతో పెప్పర్‌ఫ్రై సీఈవో అంబరీష్‌ మూర్తి మృతి

Pepperfry CEO Ambareesh Murty passed away

Pepperfry CEO Ambareesh Murty passed away

Pepperfry CEO Ambareesh Murty passed away : ఈ-కామర్స్‌ సంస్థ ‘పెప్పర్‌ఫ్రై (Pepperfry)’ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అంబరీష్‌ మూర్తి (Ambareesh Murty) గుండెపోటుతో మరణించారు. సోమవారం (ఆగస్టు 7,2023) రాత్రి లేహ్ (Leh)లో 51 ఏళ్లకే గుండెపోటుకు గురైన అంబరీష్ మృతి చెందారు. అంబరీష్ మరణం గురించి కంపెనీ మరో కో ఫౌండర్ ఆశిష్‌ షా ఎక్స్‌ లో వెల్లడించారు. ‘‘నా స్నేహితుడు, సహచరుడు, పలు విషయాల్లో నా గురువు అంబరీష్‌ మూర్తి ఇక లేరు. నిన్న రాత్రి ఆయన గుండెపోటుతో లేహ్‌లో చనిపోయారు..అంబరీష్ లేరని చెప్పటానికి చాలా బాధగా ఉంది’’ ఆశిష్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంబరీష్‌ మూర్తికి బైక్‌ రైడ్‌ అంటే ఎంతో ఇష్టం. ఆయన తరచూ ముంబై నుంచి లేహ్‌కు బైక్‌పై ప్రయాణిస్తుంటారు. దీంట్లో భాగంగానే అంబరీష్ లేహ్‌ పర్యటనకు వెళ్లగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. 2012లో అంబరీష్, ఆశిష్‌తో కలిసి ‘పెప్పర్‌ఫ్రై’ను స్థాపించారు. ఈ సంస్థ ఆన్‌లైన్‌లో ఫర్నీచర్‌, హోమ్‌ డెకార్‌ ఉత్పత్తులను విక్రయిస్తుంది.

పెప్పర్‌ఫ్రై కు ముందు అంబరీష్ ఈబే (eBay)లో ఇండియా(India), ఫిలిప్పీన్స్(Philippines), మలేషియాల (Malaysia) దేశాల్లో మేనేజన్ గా పనిచేశారు. అంతకుముంద లెవీ స్ట్రాస్(Levi Strauss), బ్రిటినియా( Britannia), పీ అండ్ ఎల్ వంటి సంస్థల్లో కూడా పనిచేశారు. ఈ సంస్థలో పలు హోదాల్లో పనిచేశారు. ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (Delhi College of Engineering)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంబరీష్ ఐఐఎం కోల్ కతా( Indian Institute of Management, Calcutta)లో ఎంబీఏ చేశారు.

ఈబేలో అతని ప్లాన్స్ కంపెనీ డెవలప్ మెంట్ కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కంపెనీ వృద్ధిని రూపొందించంటంలో కష్టమర్, అనుభవాలను మెరుగుపరచటడంలో కీలక పాత్ర పోషించారు. ఇంటర్నెట్ , మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ (Mobile Association of India (IAMAI)గా కూడా పనిచేశారు. కాగా..అంబరీష్ మరణ వార్త విని ఎంతోమంది దిగ్భ్రాంతికి గురయ్యారు. వ్యాపారదిగ్గజాలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ ట్వీట్‌లు చేస్తున్నారు.

Exit mobile version