Site icon 10TV Telugu

IRCTC insurance : 35 పైసలకే రూ.10లక్షలు బీమా .. రైల్వే టికెట్ల బుకింగ్‌తో పాటే డిఫాల్ట్‌గా బీమా సదుపాయం

IRCTC insurance

IRCTC travel insurance

IRCTC insurance default in ticket booking : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ప్రయాణీకుల కోసం తన బీమా పథకంలో మార్పులు చేసింది. IRCTC పోర్టల్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకునేటప్పుడే ప్రయాణీకులకు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ అందించబడుతుంది.

సాధారణంగా ఐఆర్ సీటీసీ (Indian Railway Catering and Tourism Corporation) ద్వారా రైల్వే టికెట్ల బుకింగ్ సమయంలో ప్రయాణికులు బీమా సదుపాయం ఆప్షన్ ను టిక్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ ను టిక్ చేస్తేనే వారు బీమా సదుపాయానికి అర్హులు అవుతారు. కానీ చాలామందికి దీనిపై అవగాహన లేకపోవటం వల్ల ఆ ఆప్షన్ ను ఉపయోగించుకోకుండా వదిలేస్తుంటారు. కానీ బీమా ఆప్షన్ క్లిక్ చేసుకుంటే రైలు ప్రమాదానికి గురి అయితే ఆ ప్రమాదంలో వారి మరణించినా..లేదా గాయాలపాలై శాశ్వత అంగవైకల్యానికి గురి అయినా వారికి రూ.10లక్షలు బీమా సొమ్ము వస్తుంది.

Aadhaar for Stray Dogs : వీధి కుక్కలకు ఆధార్ కార్డులు .. వాటి మెడలోనే క్యూఆర్ కోడ్‌ కార్డు

కొందరు దానిపై అవగాహన లేక, మరికొందరు హడావిడిలో ఆ ఆప్షన్ ను వదిలేస్తుంటారు. ఈ విషయాన్ని గుర్తించిన ఐఆర్ సీటీసీ బీమా ఆప్షన్ ను డిఫాల్ట్ చేసేసింది. ఇది ప్రయాణీకులకు శుభవార్త అనే చెప్పాలి. దీంతో ఇకపై టికెట్ తో పాటే బీమా సదుపాయం కూడా డిఫాల్ట్ గా లభిస్తుందన్నమాట. అంటే మనం టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ప్రత్యేకించి ఆ ఆప్షన్ ను క్లిక్ చేయకుండానే అది ఆటోమేటిక్ టిక్ చేసే ఉంటుంది ఆ బాక్సులో..అంటే ప్రయాణికులు ప్రత్యేకంగా టిక్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట.

కాగా ప్రయాణీకులు ఒకవేళ బీమా అవసరం లేదు అనుకునేవారు ఆ టిక్ ను తీసేయొచ్చు. అంటే No బటన్ నొక్కాలి. కానీ ప్రత్యేకించి పెద్దగా ఖర్చులేనప్పుడు పైగా కేవలం పైసలతోనే రూ.10లక్షలు బీమా వస్తున్నప్పుడు వద్దనుకునే ప్రయాణీకులు బహుశా ఉండరనే చెప్పాలి. కానీ ప్రయాణీకులు అభీష్టం మేరక ఈ ఆప్షన్ కూడా ఇచ్చింది ఐఆర్ సీటీసీ. ఈ బీమాకు కోసం ప్రయాణీకుల నుంచి కేవలం 35 పైసలు మాత్రమే. బీమా రక్షణను రెండు జీవితేతర బీమా కంపెనీలు అందిస్తున్నాయి, అవి SBI జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు లిబర్టీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.

కాగా భారత్ లో ఎక్కడా ఇలా డిఫాల్ట్ గా బీమా సదుపాయాన్ని పైగా కేవలం పైసలతోనే ఎక్కడా డిఫాల్ట్ గా ఇవ్వరు. ఒక్క ఐఆర్ సీటీసీకి మాత్రం మినహాయింపునివ్వటం గమనించాల్సిన విషయం.
కాగా ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు..పైగా ఇటీవల రైలు ప్రమాదాలు ఎన్ని జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఇటువంటి సమయంలో ఐఆర్ సీటీసీ ఇటువంటి సదుపాయాన్ని కలిగించటం పైగా టికెట్ రిజర్వేషన్ తోపాటు డిఫాల్ట్ ఆప్షన్ ఇవ్వటం శుభపరిణామం అని చెప్పాలి.

 

Exit mobile version