Site icon 10TV Telugu

60 year Old Child : 60 ఏళ్లు గర్భాన్ని మోసిన మహిళ, 92 ఏళ్లలో ప్రసవం .. బిడ్డ పరిస్థితి ఎలా ఉందంటే..?!

92 year woman gave birth to 60 year child

92 year woman gave birth to 60 year child

92 year woman gave birth to a 60 year old child : మహిళలు తొమ్మిది నెలలు బిడ్డను మోయటం..ప్రసవించటం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఓ మహిళ మాత్రం తన 30 ఏటను గర్భం దాల్చితే ఆమెకు 92 ఏళ్లు వచ్చాక ప్రసవించింది. ప్రపంచలోనే అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించిన ఈ కేసును పరిశీలించిన వైద్య నిపుణులు సైతం నోరెళ్లబెట్టారు. వినటానికి కూడా ఏమాత్రం నమ్మశక్యం కాని ఈ వింత చైనాలో జరిగింది. ఏకంగా 60 ఏళ్లు గర్భాన్ని మోయడం, 92 ఏళ్లలో ప్రసవించటం అనే వార్త అస్సలు నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజంగానే జరిగింది. ప్రపంచ వైద్యశాస్త్రన్ని సైతం నివ్వెరపరిచిన ఈ ఘటనలో మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..61 ఏళ్ల గర్భాన్ని మోసినా ఆమెకు ఎటువంటి సమస్య లేకపోవటం మరింత షాకింగ్ విషయం..ఇంతకీ అనేళ్లు మోసిన గర్భంలో శిశువు పరిస్థితి ఏంటీ…శిశువు బతికే ఉందా..?అనేది చాలా ఆసక్తికరమైన విషయం…

వింత గొలిపే ఈ విషయం గురించి ఒక్కమాటలో 92 ఏళ్ల మహిళ 60 ఏళ్ల శిశువుకు జన్మనిచ్చిందని చెప్పుకోవాలి. చైనాకు చెందిన మహిళ హువాంగ్‌ యిజున్‌ (Huang Yijun)వయస్సు ఇప్పుడు 92. ఆమె 1948లో 31 ఏళ్ల వయసులో ఉండగా గర్భం దాల్చింది. ఆ సమయంలో ఆమె డాక్టర్లకు చూపించుకోగా ఆ పిండం ఆమె గర్భాశయానికి వెలుపల పెరుగుతోందని..ఇది తల్లీ బిడ్డల ప్రాణానికే ప్రమాదమని..వెంటనే అబార్షన్ చేయించుకోవాలని సూచించారు. ఒకవేళ బిడ్డ కోసం గర్భాన్ని ఉంచుకున్నా పిండం పెరగదని చెప్పారు. వెంటనే అబార్షం చేయించుకోవాలని చెప్పారు. కానీ ఆమె పేదరాలు. అబార్షన్ చేయించుకోవటానికి కూడా డబ్బు కావాలి. దాంతో ఆమె ఏదైతే అది అవుతుందని మొండిగా అలాగే ఉండిపోయింది.

విచిత్రంగా ఆమెకు ఎలాంటి నొప్పి గానీ గర్భ స్రావం అయినట్లుగా బ్లీడింగ్ కూడా అవ్వలేదు. ఎటువంటి సమస్యలు లేకపోవటంతో గర్భాన్ని మోస్తూ వచ్చింది. ఎన్నాళ్లు గడిచినా అబార్షన్ అవ్వలేదు. బిడ్డపుట్టలేదు. తన బిడ్డ కడుపులో బతికే ఉండి ఉంటుందని ఆశపడేది. రాను రాను ఆ ఆశ అడుగంటిపోయింది. వారాలు నెలలుగా నెలలు సంవత్సరాలుగా సంవత్సరాలు దశాబ్దాలుగా గడిచిపోయినా ఆమె గర్భాన్ని మాత్రం అలాగే మోసింది.

Raksha bandhan 2023 : భారత్‌పై దండెత్తిన అలెగ్జాండర్ ప్రాణాలను కాపాడిన ‘రక్షాబంధన్’.. ఎలాగో తెలుసా?

అలా ఒకటీ రెండు కాదు 10,20 కాదు ఏకంగా 61 ఏళ్లు గడిపింది. కానీ ఎటువంటి సమస్యలు రాకపోవటం మరో వింత విశేషమని చెప్పాలి. గర్భంతో ఉన్నట్లుగా పొట్ట కూడా ఎత్తుగానే ఉండేది. కానీ గడుపులో పడ్డ నలుసు భూమ్మీదకు ఎలాగైనా రావాల్సిందే అన్నట్లుగా ఆమెకు 92 ఏళ్ల వయస్సులో డాక్టర్ల వద్దకు వెళ్లింది. విషయం చెప్పింది. గర్భంతో ఉన్నట్లుగా కనిపిస్తున్న ఆమెను చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. చెప్పింది విని ఇంకా షాక్ అయ్యారు. ఆమె మాటలు విని తేరుకోవటానికి వారికి కాస్త సమయం పట్టింది.

ఆమె చెప్పేది నిజమేనా? అని డౌట్ తో అన్ని రకాలు పరీక్షలు చేశారు. రిపోర్టు చూసి డాక్టర్ల ఆశ్చర్యానికి అంతేలేదు. వారి ఆశ్చర్యం గురించి ఎంత చెప్పినా తక్కేవే అన్నట్లుగా మారింది వారి పరిస్థితి. బహుశా ప్రపంచంలోనే ఇటువంటి ఘటన జరిగి ఉండదని అనుకున్నారు. ఆమె కడుపులోపల ఆ బిడ్డ చనిపోయి స్లోన్‌(రాయిలా)లా మారి అలా ఉండిపోయిందని గుర్తించిన డాక్టర్ల ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. ఇంత కాలంలో బిడ్డ కడుపులో ఉండిపోయినా ఆమెకు ఎటువంటి ఇన్ఫెక్షన్‌ రాకపోవటంతో ఆమె చనిపోయిన పిండతో అలానే ఉండిపోవడం మాత్రం నిజంగా షాకింగ్‌గా ఉందని తెలిపాడు డాక్టర్లు.

Madurai Bench : భార్య ప్రసవానికి సెలవు కావాలని ఎస్సై దరఖాస్తు, అంగీకరించిన అధికారులపై కోర్టు ఆగ్రహం

చివరకు డాక్టర్లు ఆమెకు సర్జరీ చేసి స్టోన్‌ బేబిని బయటకు తీశారు. వైద్య చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వింత కేసు ఇది అని తెలిపారు. స్టోన్ బేబీ ఫోటోలు, 92 ఏళ్ల హువాంగ్‌ యిజున్‌ వింత కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఏకంగా 61 సంవత్సరాల గర్భమా? అని ఆశ్చర్యపోతున్నారు.

కాగా దాదాపు ఇటువంటి ఘటనలో గతంలో కొలంబియాలో జరిగింది. 82 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో ఆస్పత్రికి రాగా డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆమె కడుపులో 40 ఏళ్లుగా పిండం ఉందని అది స్లోన్ బేబీగా మారిపోయిందని గుర్తించారు. ఆ బిడ్డను సర్జరీ ద్వారా తొలగించారు.

 

Exit mobile version