Car Fires: జర్నీలో ఉండగానే కారులో మంటలు.. అప్రమత్తతే బ్రతికించింది!

ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. అందులో ప్రయాణించే వారు ముందుగా అప్రమత్తమై కారును పక్కకి ఆపి కిందకి దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఇలాంటి వార్తలు ఈ మధ్య మనం తరచుగా వింటున్నాం.

Car Fires: ప్రయాణికులతో వెళ్తున్న కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి. అందులో ప్రయాణించే వారు ముందుగా అప్రమత్తమై కారును పక్కకి ఆపి కిందకి దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. ఇలాంటి వార్తలు ఈ మధ్య మనం తరచుగా వింటున్నాం. సహజంగానే వేసవి కాలంలో ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. వేసవి తాపానికి తట్టుకోలేక కార్లలో ఏసీల వాడకం ఎక్కువవడంతో ఇంజన్, ఎలక్రికల్ సర్క్యూట్స్ మీద భారం ఎక్కువై ఈ ప్రమాదాలకు అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తుంటారు.

ఈ ఏడాది కూడా ఎండలు దంచి కొడుతున్నాయి. దక్షణాదిలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఈ కారణంగానే తరచుగా వాహనాలలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గురువారం చెన్నై- కోల్ కతా జాతీయ రహదారిపై నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అందులో ప్రయాణించే వారు అప్రమత్తమై కిందకి దిగగా కారును రోడ్డుపక్కకి ఆపారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

Car Fires

గుంటూరు జిల్లా తెనాలిలో మాంటిస్సోరి స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న జేమ్స్ మొరైలీ తన కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి కేరళ వెళ్లి అక్కడి నుంచి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలోనే తెనాలి సిఆర్ కళాశాల సమీపంలోకి రాగానే ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగడంతో కారు ఆపి అందరూ కిందకు దిగారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదం జరిగింది జాతీయ రహదారిపై కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమవగా కారులోని రెండు ల్యాప్ టాప్ లు, 15 వేల రూపాయల నగదు దుస్తులు కాలిపోయినట్లుగా బాధితులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు