Syed Hafeez: ‘ఫోర్బ్స్ ఇండియా’ జాబితాలో తెలంగాణ వాసికి చోటు

‘ఫోర్బ్స్ ఇండియా’ సంస్థ ప్రకటించిన ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’ జాబితాలో తెలంగాణ వాసికి చోటు దక్కింది. పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్‌ అనే యూట్యూబర్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

Syed Hafeez: తెలంగాణకు చెందిన ప్రముఖ టెక్ యూట్యూబర్ సయ్యద్ హఫీజ్‌కు ‘ఫోర్బ్స్ ఇండియా’ జాబితాలో చోటు దక్కింది. ఇటీవల ఈ సంస్థ విడుదల చేసిన ‘టాప్ 100 డిజిటల్ స్టార్స్’లో సయ్యద్ హఫీజ్‌ ఒకడిగా నిలిచాడు. ఈ జాబితాలో అతడు 32వ స్థానం దక్కించుకోవడం విశేషం.

Tirumala : ఆగ‌స్టు 1 నుండి తిరుమ‌ల‌లో అఖండ హ‌రినామ సంకీర్త‌న‌

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సయ్యద్ హఫీజ్ 2011 నుంచి ‘తెలుగు టెక్ ట్యూట్స్’ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. ఈ ఛానెల్‌కు ప్రస్తుతం 15 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. తన ఛానెల్ ద్వారా టెక్నాలజీకి సంబంధించిన అంశాలు, లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్, గాడ్జెట్స్ గురించి వివరిస్తాడు. ఫోర్బ్స్ ఇండియా, ఐఎన్‌సీఏ, గ్రూప్ ఎమ్ సంస్థలు కలిపి సంయుక్తంగా దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ స్టార్స్‌ను ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా ద్వారా యూజర్లను ఆకట్టుకుంటున్న కంటెంట్ క్రియేటర్లను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించింది. కామెడీ, ఫుడ్, టెక్, ట్రావెల్, సోషల్ వర్క్, బ్యూటీ, ఫిట్‌నెస్, ఫ్యాషన్, బిజెనెస్ వంటి తొమ్మిది అంశాల్లో కంటెంట్ క్రియేటర్లను ఈ జాబితాకు ఎంపిక చేశారు.

Blackheads : బ్లాక్ హెడ్స్ నివారణ కోసం చిట్కాలు!

వీరు ఎలాంటి కంటెంట్ అందిస్తున్నారు.. ఎంత మందికి రీచ్ అవుతోంది.. ఆ కంటెంట్‌తో ఎంతమంది ఎంగేజ్ అవుతున్నారు.. కంటెంట్ జెన్యూన్‌గా ఉందా.. లేదా.. ఇలా అనేక అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా రూపొందించింది. ఇందులో సయ్యద్ హఫీజ్ రూపొందించిన కంటెంట్ 8.89 క్రియేట్ స్కోర్ సాధించింది. దీంతో ఆయనకు ఈ జాబితాలో చోటు దక్కింది.

ట్రెండింగ్ వార్తలు