RCB vs CSK : వ‌ర్షం కార‌ణంగా సీఎస్‌కేతో మ్యాచ్ ర‌ద్దైతే బెంగ‌ళూరు ప‌రిస్థితి ఏంటి?

ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది.

Chennai Super Kings – Royal Challengers : ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఇప్ప‌టికే మూడు జ‌ట్లు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు ఫ్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాయి. ముంబై ఇండియ‌న్స్‌, గుజ‌రాత్ టైటాన్స్‌, పంజాబ్ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ లు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్క‌మించాయి. మిగిలిన ఒక్క స్థానం కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ పోటీప‌డుతున్నాయి.

కాగా.. ఆర్‌సీబీ, సీఎస్‌కే జ‌ట్ల మ‌ధ్య మే 18 శ‌నివారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి వేదిక‌గా మ్యాచ్ జ‌రనుంది. ప్లే ఆఫ్స్‌లో ఏ జ‌ట్టు అడుగుపెట్ట‌నుంద‌నే విష‌యం ఈ మ్యాచ్ ద్వారా తేలిపోనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే 16 పాయింట్ల‌తో ఎలాంటి స‌మీక‌ర‌ణాల‌తో ప‌ని లేకుండా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒక‌వేళ ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే మాత్రం చెన్నైపై భారీ తేడాతో గెల‌వాల్సి ఉంటుంది.

Kavya Maran : ప్లేఆఫ్స్‌కు చేరిన హైద‌రాబాద్‌.. ఆనందంలో కావ్యా పాప ఉండ‌గా.. స‌డెన్‌గా..

చెన్నైతో మ్యాచులో మొద‌ట బ్యాటింగ్ చేస్తే ఆర్‌సీబీ 18 ప‌రుగులు, ల‌క్ష్య ఛేద‌న అయితే 11 బంతులు మిగిలి ఉండ‌గా అంటే 18.1 ఓవ‌ర్‌లో ఛేదించాల్సి ఉంటుంది. అప్పుడు రెండు జ‌ట్లు 14 పాయింట్ల‌తో ఉన్న‌ప్ప‌టికీ చెన్నై ర‌న్‌రేటు కంటే మెరుగైన ర‌న్‌రేటుతో ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ వెలుతుంది. అలా కాకుండా స్వ‌ల్ప తేడాతో ఆర్‌సీబీ మ్యాచ్ గెలిచినా సీఎస్‌కేనే ప్లేఆఫ్స్ వెళ్ల‌నుంది.

వ‌ర్షం ప‌డి మ్యాచ్ ర‌ద్దైంతే..

అకాల వ‌ర్షాల కార‌ణంగా ఇప్ప‌టికే గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైన సంగ‌తి తెలిసిందే. ఇక సీఎస్‌కే, బెంగ‌ళూరు మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు పొంచిఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ చెబుతోంది. దీంతో ఈ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయితే అది ఆర్‌సీబీకి తీర‌ని న‌ష్టం చేకూరుస్తుంది. మ్యాచ్ ర‌ద్దు అయితే ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. అప్పుడు ఆర్‌సీబీ 13 పాయింట్ల‌తో ఉండ‌గా, 15 పాయింట్ల‌తో చెన్నై ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.

Pakistan : పాకిస్తాన్.. ఇంకెన్ని రోజులు.. పీసీబీ నిద్రపోతుందా?

వ‌ర్షం మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించ‌నుంద‌ని తెలుసుకున్న ఆర్‌సీబీ అభిమానులు.. వ‌రుణ‌దేవా కాస్త క‌రుణించ‌వ‌య్యా అంటూ ప్రార్థిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు