Kavya Maran : ప్లేఆఫ్స్‌కు చేరిన హైద‌రాబాద్‌.. ఆనందంలో కావ్యా పాప ఉండ‌గా.. స‌డెన్‌గా..

గ‌త కొన్ని సీజ‌న్లుగా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ సీజ‌న్‌లో అద‌ర‌గొడుతోంది.

Kavya Maran : ప్లేఆఫ్స్‌కు చేరిన హైద‌రాబాద్‌.. ఆనందంలో కావ్యా పాప ఉండ‌గా.. స‌డెన్‌గా..

Kavya Maran Spotted Hugging Kane Williamson

Kane Williamson – Kavya Maran : గ‌త కొన్ని సీజ‌న్లుగా పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర విమ‌ర్శ‌ల పాలైన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఈ సీజ‌న్‌లో అద‌ర‌గొడుతోంది. కొత్త కెప్టెన్ పాట్ క‌మిన్స్ నేతృత్వంలోని స‌న్‌రైజ‌ర్స్ ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపిస్తూ ఈ సీజ‌న్‌లో ప్లే ఆఫ్స్‌కు దూసుకువెళ్లింది. గురువారం ఉప్ప‌ల్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ త‌ల‌ప‌డాల్సి ఉండ‌గా ఈ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. దీంతో ఇరు జ‌ట్ల‌కు అంపైర్లు చెరో పాయింట్‌ను కేటాయించారు. 15 పాయింట్ల‌తో స‌న్‌రైజ‌ర్స్ ఈ సీజ‌న్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన మూడో జ‌ట్టుగా నిలిచింది.

చాన్నాళ్ల త‌రువాత ప్లే ఆఫ్స్‌లో హైద‌రాబాద్ అడుగుపెట్ట‌డంతో జ‌ట్టు య‌జ‌మాని కావ్యా మార‌న్ ప‌ట్ట‌రాని సంతోషంలో మునిగిపోయింది. వేలంలో తాను కొనుగోలు చేసిన ఆట‌గాళ్లు అద్భుతంగా రాణించి ప్లే ఆఫ్స్‌కు చేర్చ‌డంతో సంబ‌రాల్లో మునిగిపోయింది.

Babar Azam : ఐపీఎల్‌లో కోహ్లి బిజీ.. విరాట్ రికార్డుల ప‌ని ప‌డుతున్న బాబ‌ర్ ఆజాం

కేన్‌మామ‌ను కౌగిలించుకున్న కావ్యా మార‌న్‌..

ఈ సంతోష స‌మ‌యంలో ఓ అనుకొని అతిథి కావ్యా మార‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చాడు. అత‌డి చూసిన ఆమె ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించ‌డమే కాదు కౌగిలించుకుంది. అత‌డు మ‌రెవ‌రో కాదు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాజీ కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్‌. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

కాగా.. కేన్ మామ 2021, 2022 సీజ‌న్ల‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. అత‌డి నాయ‌క‌త్వంలో ప్లే ఆఫ్స్‌కు చేర‌డంలో విఫ‌లం కావ‌డం, జ‌ట్టు దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ అత‌డిని కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించి వేలానికి విడిచిపెట్టింది. ఈ క్ర‌మంలో గుజ‌రాత్ టైటాన్స్ కేన్ మామ‌ను సొంతం చేసుకుంది.

సర్‌ప్రైజ్.. డూ ఆర్ డై మ్యాచ్ వేళ.. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ధోనీ

గురువారం స‌న్‌రైజర్స్‌, గుజ‌రాత్ మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ రద్దు కావ‌డం.. త‌న పాత జ‌ట్టు హైద‌రాబాద్ ప్లే ఆఫ్స్‌కు వెళ్ల‌డంతో అక్క‌డే ఉన్న కావ్యా మార‌న్ ను విలియ‌మ్స‌న్ వెళ్లి ప‌ల‌క‌రించాడు.