సర్‌ప్రైజ్.. డూ ఆర్ డై మ్యాచ్ వేళ.. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ధోనీ

MS Dhoni: సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి టీ..

సర్‌ప్రైజ్.. డూ ఆర్ డై మ్యాచ్ వేళ.. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన ధోనీ

MS Dhoni

Updated On : May 17, 2024 / 9:29 AM IST

ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో నాలుగు, ఆరో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు శనివారం డూ ఆర్ డై మ్యాచ్ ఆడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు ప్లేఆఫ్‌ల రేసులో ఉన్న విషయం తెలిసిందే.

శనివారం జరిగే మ్యాచుతో ఏ జట్టు ప్లేఆఫ్ లో ఉండనుందో తేలిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే సీఎస్కే జట్టు చిన్నస్వామి స్టేడియం వద్దకు చేరుకుంది. ఈ కీలక మ్యాచుకు ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లోకి సీఎస్కే బ్యాటర్ ధోనీ వెళ్లాడు.

సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆర్సీబీ ఆటగాళ్లతో కలిసి టీ కూడా తాగినట్లు తెలుస్తోంది. కాగా, గురువారం మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్లేఆఫ్ కి చేరింది.

అలాగే, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా ఇప్పటికే ప్లేఆఫ్ చేరుకున్నాయి. మిగిలిన ఒక్క ప్లేఆఫ్ స్థానం కోసం సీఎస్కే, ఆర్సీబీ మధ్య పోటీ ఉంది. సీఎస్కే ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ చేరుతుంది. ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తేనే ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Royal Challengers Bengaluru (@royalchallengers.bengaluru)

Also Read: కొత్త హెయిర్ స్టైల్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్న విరాట్ కోహ్లీ