Kohli Video: కొత్త హెయిర్ స్టైల్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తున్న విరాట్ కోహ్లీ
కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. 13 మ్యాచుల్లో 661 పరుగులు బాది రన్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

Virat Kohli
టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనమిస్తున్నాడు. ఐపీఎల్ 2024 మరికొన్ని రోజుల్లో ముగుస్తుందన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కాస్త విరామం తర్వాత ఇండియన్ క్రికెట్ టీమ్.. వెస్టిండీస్, అమెరికాలో జరిగే 2024 టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు బయలుదేరనుంది.
రోహిత్ శర్మ సారథ్యంలో ఆడిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచులో ఓడిన టీమిండియా టీ20 ప్రపంచ కప్‌నయినా సాధించాలన్న పట్టుదలతో ఉంది. టీ20 ప్రపంచ కప్‌కు ముందు విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్‌తో కనపడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
New hairstyle for T20 WC???#viratkohli pic.twitter.com/4Vdp4Ha3PQ
— ?????? (@wrognxvirat) May 16, 2024
టీమిండియాలో విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. టీమ్ కి మంచి ఆరంభాన్ని ఇచ్చే బాధ్యత కోహ్లీపై ఉంటుంది. కోహ్లీ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. 13 మ్యాచుల్లో 661 పరుగులు బాది రన్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇదే ఊపుతో అతడు భారత్ కు టీ20 ప్రపంచ కప్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.