SRH vs GT : మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం.. ప్లే ఆఫ్స్‌కు హైద‌రాబాద్‌

ఉప్ప‌ల్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది.

SRH vs GT : మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం.. ప్లే ఆఫ్స్‌కు హైద‌రాబాద్‌

SRH vs GT

మ్యాచ్ ర‌ద్దు..
ఉప్ప‌ల్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దైంది. దీంతో ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్‌ను కేటాయించాయి. ఫ‌లితంగా హైద‌రాబాద్ 15 పాయింట్ల‌తో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.

రాత్రి 10.30 వ‌ర‌కు..
వ‌రుణుడు శాంతించాడు. దీంతో మైదానంలోని క‌వ‌ర్ల‌ను సిబ్బంది తొల‌గిస్తున్నారు. ఈ క్ర‌మంలో హెచ్‌సీఏ మ్యాచ్‌పై కీలక అప్ డేట్ ఇచ్చింది. మ్యాచ్ నిర్వహణకు రాత్రి 10.30 గంటల వరకు సమయం ఉన్నట్లు పేర్కొంది. వర్షం నీళ్లను పూర్తిగా డ్రైనౌట్ చేసి గ్రౌండ్ ను సిద్ధం చేసేందుకు 100 మందికి పైగా తీవ్రంగా శ్రమిస్తున్నారని పేర్కొంది. హెచ్ సీఏ సిబ్బంది, ఫ్యాన్స్ నిరుత్సాహ పడవద్దు అని హెచ్ సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు వెల్లడించారు.

టాస్ ఆల‌స్యం..
కాసేపు తెరిపినిచ్చిన వ‌ర్షం మ‌ళ్లీ మొద‌లైంది. పిచ్ పై మ‌ళ్లీ క‌వ‌ర్ల‌ను క‌ప్పారు. దీంతో టాస్ ఆల‌స్యం కానుంది.

ఆట‌గాళ్లు సైతం మైదానానికి చేరుకున్నారు. ఈ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ విజ‌యం సాధిస్తే ఎలాంటి స‌మీక‌ర‌ణాలు లేకుండానే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్ట‌నుంది.


ఐపీఎల్‌17లో భాగంగా ఉప్ప‌ల్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ప్రారంభానికి ముందు వ‌ర్షం కురిసింది. వ‌ర్షం తెరిపినివ్వ‌డంతో పిచ్ పై ఉన్న క‌వ‌ర్ల‌ను తొల‌గిస్తున్నారు. మ్యాచ్ కోసం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. మ‌రో వైపు ప్రేక్ష‌కులు మైదానానికి చేరుకుంటున్నారు.