The Taj Story OTT: ఓటీటీలో వివాదాస్పద మూవీ.. ‘ది తాజ్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
లయన్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తున్న 'ది తాజ్ స్టోరీ(The Taj Story OTT)' మూవీ.
The Taj Story movie OTT streaming update
- లయన్ గేట్ ప్లేలో ‘ది తాజ్ స్టోరీ’
- అధికారిక ప్రకటన చేసిన మేకర్స్
- మార్చి 13 నుంచి స్ట్రీమింగ్
The Taj Story OTT: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల విడుదలైన వివాదాస్పద సినిమా ‘ది తాజ్ స్టోరీ’. నటుడు పరేష్ రావల్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు తుషార్ అమ్రిష్ గోయెల్ తెరకెక్కించాడు. ట్రైలర్ తోనే వివాదం క్రియేట్ చేసిన ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజంగా తాజ్ మహల్ ప్రేమకు చిహ్నంగా షాజహాన్ కట్టించాడా? లేదా చరిత్రను వక్రీకరించారా? అసలు తాజ్ మహల్ వెనుక ఉన్న రహస్యం ఏంటి అనే కథాంశంతో ఈ సినిమా వచ్చింది.
సింపుల్ గా చెప్పాలంటే, విష్ణు దాస్ అనే ఒక టూర్ గైడ్ తాజ్ మహల్ వెనుక ఉన్న నిజమైన చరిత్రను వెలికితీసే ప్రయాణమే ఈ సినిమా. అందుకే ఈ సినిమాపై ఒక వర్గం వ్యతిరేకతను చూపించింది. దాంతో, ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. అయినప్పటికి సినిమా విడుదల అయ్యింది.అయితే, దాదాపు నాలుగు నెలల తరువాత ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో ‘ది తాజ్ స్టోరీ(The Taj Story OTT)’ మూవీ మార్చి 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మరి థియేటర్స్ లో వివాదం క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.
