RCB : ఐపీఎల్ 2026కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్ ? స్టార్ పేసర్ ఆడడం అనుమానమే?
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB ) బరిలోకి దిగనుంది.
RCB pacer Josh Hazlewood doubtful for IPL 2026
- మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్
- ఆర్సీబీకి భారీ షాక్
- కీలక ఆటగాడు దూరం!
RCB : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగనుంది. అయితే.. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఆర్సీబీని ఓ వార్త ఇబ్బంది పెడుతోంది. ఆ జట్టు స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ పూర్తిగా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి.
అందని ద్రాక్షగా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ ట్రోఫీని 2025లో ఆర్సీబీ కైవసం చేసుకుంది. ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టైటిల్ గెలుచుకోవడంలో ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మ్యాచ్ గమనాన్ని మార్చేశాడు.
IPL 2026 : ఐపీఎల్ 2026కు ముందు గుజరాత్ కీలక నిర్ణయం.. కొత్త అసిస్టెంట్ కోచ్‌గా విజయ్ దహియా
అయితే.. ఆ తరువాత గాయపడడంతో భారత్‌తో టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌కు అతడు దూరం అయ్యాడు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అతడు పూర్తిగా కోలుకోలేదని అంటున్నారు.
ప్రస్తుతం అతడు ఫిజియో ఆధ్వర్యంలో ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నాడు. దీంతో అతడు ఐపీఎల్ ఆడేది అనుమానంగా మారిందని సదరు వార్తల సారాంశం. అయితే.. మార్చి చివరి నాటికి అతడు ఫిట్నెస్ సాధించే అవకాశాలు 50-50 ఉన్నట్లు చెబుతున్నారు.
BAN vs PAK : బంగ్లాదేశ్ చేతిలో ఓటమి.. పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ కీలక వ్యాఖ్యలు..
ఒకవేళ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ 2026కి దూరం అయితే అది ఆర్సీబీకి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు.
