Pakistan : పాకిస్తాన్.. ఇంకెన్ని రోజులు.. పీసీబీ నిద్రపోతుందా?

ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌లో 20 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి

Pakistan : పాకిస్తాన్.. ఇంకెన్ని రోజులు.. పీసీబీ నిద్రపోతుందా?

Ramiz Raja on Pakistan T20 World Cup squad announcement delay

Pakistan T20 World Cup squad announcement delay : ఊరందరిదీ ఒక దారైతే ఉలిపి కట్టెది ఇంకో దారి అన్న నానుడి మ‌న‌కు తెలిసిందే. ఈ సామెత మ‌న పొరుగున ఉన్న పాకిస్తాన్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిధ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనున్న జ‌ట్ల వివ‌రాల‌ను ఒక్క పాకిస్తాన్ త‌ప్ప మిగిలిన దేశాల‌ క్రికెట్ బోర్డులు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశాయి. అయితే.. పాకిస్తాన్‌ జ‌ట్టును ఎప్పుడు ప్ర‌క‌టిస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. దీనిపై ఆ జ‌ట్టు మాజీ క్రికెట్ బోర్డు ఛైర్మ‌న్ రమీజ్ రాజా అసంతృప్తిని వ్య‌క్తం చేశాడు.

ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌లో 20 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. 19 జ‌ట్లు ఇప్ప‌టికే త‌మ ఆట‌గాళ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించాయి. అయితే.. ఒక్క పాకిస్తాన్ మాత్ర‌మే త‌మ ఆట‌గాళ్ల పేర్ల‌ను తెల‌ప‌లేదు. మ‌రీ.. ఇన్ని రోజులుగా పాకిస్తాన్ సెల‌క్ట‌ర్లు ఏం చేస్తున్నారు అనే విష‌యం త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని ర‌మీజ్ రాజా అన్నాడు. రైట్ హ్యాండ్‌, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేష‌న్‌లో టీమ్‌ను ఎంపిక చేయొచ్చు. అయిన‌ప్ప‌టికీ సెల‌క్ష‌న్ క‌మిటీ ఎందుకు ఇంత ఆల‌స్యం చేస్తుందో తెలియ‌డం లేద‌న్నారు.

DC vs LSG : ఏమ‌య్యా గోయెంకా.. పంత్‌ను కౌగిలించుకున్నావ్ స‌రే.. రాహుల్‌తో మ‌ళ్లీ ఏందిది..

ప్ర‌తి ఒక్క ఆట‌గాడు కూడా ట్ర‌య‌ల్స్‌లో ఉన్న‌ట్లుగానే క‌నిపిస్తోంద‌ని, ఐర్లాండ్‌తో సిరీస్‌లో బౌల‌ర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని చెప్పాడు. బౌల‌ర్లు ఒత్త‌డికి లోన‌వుతున్నార‌ని, హాస‌న్ అలీ ప్ర‌ద‌ర్శ‌న గొప్ప‌గా లేద‌న్నాడు. మ‌హ్మ‌ద్ అమీర్ ఆట‌తీరు నిరాశ ప‌రిచింద‌ని చెప్పుకొచ్చారు. జ‌ట్టులో అబ్బాస్ అఫ్రిది రోల్ ఏంటో త‌న‌కు తెలియ‌ట్లేద‌న్నాడు.

ఇక ఐర్లాండ్ సిరీస్‌లో కెప్టెన్ బాబ‌ర్ ఆజాం అద్భుతంగా ఆడాడ‌ని మెచ్చుకున్నాడు. అత‌డి స్ట్రైక్‌రేటు చాలా బాగుంద‌న్నాడు. ప‌సికూన ఐర్లాండ్ బౌలింగ్ బ‌ల‌హీన‌మైన‌దే అయిన్ప‌ప‌టికీ కూడా బాబ‌ర్ ఆడిన విధానం మాత్రం ఎలాంటి బౌల‌ర్‌కైనా ఇబ్బంది పెట్టేలా ఉంద‌ని ర‌మీజ్ పేర్కొన్నాడు.

Virat Kohli : నన్ను చూస్తే నీకు న‌వ్వొస్తుందా పంత్‌..! వెళ్లి కూర్చో.. లేదంటే బ్యాట్‌తో కొడ‌తా : విరాట్ కోహ్లి