Inka Em Anukoledhu: వెరైటీగా “ఇంకా ఏం అనుకోలేదు” టైటిల్ వీడియో.. ETV విన్, వంశీ నందిపాటి కాంబోలో మరో క్రేజీ మూవీ
'ఇంకా ఏం అనుకోలేదు(Inka Em Anukoledhu)' టైటిల్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్.
Inka Em Anukoledhu title video released
Inka Em Anukoledhu: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి, ETV విన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రాజెక్ట్‌లన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వెరైటీ కామెడీతో కూడిన కంటెంట్-ఓరియెంటెడ్ సినిమాలకు ఈ కాంబినేషన్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఇప్పుడు తాజాగా వీరిద్దరూ కలిసి “ఇంకా ఏం అనుకోలేదు(Inka Em Anukoledhu)” అనే క్రేజీ ప్రాజెక్ట్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో మాత్రం చాలా వెరైటీగా ఉంది. మీమ్స్, సెటైర్స్ , పాత ETV థీమ్ సాంగ్స్ ను కలిపి చేసి నెటిజన్లను భలేగా నవ్వించారు. అలాగే, వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో నటించే నటీనటులు ఎవరనే విషయాన్ని ఇప్పటికైతే సస్పెన్స్‌గానే ఉంచారు. టైటిల్ అనౌన్స్మెంట్ తోనే ఇంతటి బజ్ క్రియేట్ చేయడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ క్రేజీ సినిమాను ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని తెరకెక్కిస్తున్నారు. ఈ ‘బ్రోమాంటిక్ కామెడీ’ చిత్రం సెప్టెంబర్ 4, 2026న థియేటర్లలో విడుదల కానుంది.
టైటిల్ చెప్పాలంటే.. “ఇంకా ఏం అనుకోలేదు”#InkaEmAnukoledhu #IEAOnSEPT4th💥💥@etvwin @VNE_Offl @Pranaiv @GiriPemmasani@SinjithYerramil @Rehan_dop @KannuSameer @VennapusaR48043 @anuragkautoori @22Nnk @PradeepGSound @madurimadhu1 @thisisputta pic.twitter.com/jOdt16eosg
— Vamsi Nandipati (@connect2vamsi) March 10, 2026
