Virat Kohli : నన్ను చూస్తే నీకు న‌వ్వొస్తుందా పంత్‌..! వెళ్లి కూర్చో.. లేదంటే బ్యాట్‌తో కొడ‌తా : విరాట్ కోహ్లి

ప‌రుగుల యంత్రం రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లి మైదానంలో ఎలా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Virat Kohli : నన్ను చూస్తే నీకు న‌వ్వొస్తుందా పంత్‌..! వెళ్లి కూర్చో.. లేదంటే బ్యాట్‌తో కొడ‌తా : విరాట్ కోహ్లి

Virat Kohli Angry With Cheeky Rishabh Pant Gesture in RCB vs DC match

Virat Kohli – Rishabh Pant : ప‌రుగుల యంత్రం రికార్డుల‌ రారాజు విరాట్ కోహ్లి మైదానంలో ఎలా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రిష‌బ్ పంత్ మాత్రం ప‌రిస్థితుల‌తో దాదాపుగా సంబంధం లేకుండా చాలా స‌ర‌దాగానే క‌నిపిస్తుంటాడు. ఇక టీమ్ఇండియా త‌రుపున క‌లిసిన ఆడుతున్న పంత్‌, కోహ్లిల మ‌ధ్య చాలా చ‌క్క‌ని స్నేహ బంధం ఉంది. ఐపీఎల్‌లోనూ ఇది క‌నిపిస్తూనే ఉంటుంది.

ఆదివారం (మే 12న) చిన్న‌స్వామి వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 187 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో ర‌జ‌త్ పాటిదార్ (32 బంతుల్లో 52), విల్ జాక్స్ (29 బంతుల్లో 41), కామెరూన్ గ్రీన్ (24 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (13 బంతుల్లో 27) లు రాణించారు. ల‌క్ష్య ఛేద‌న‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ 19.1 ఓవ‌ర్ల‌లో 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఆర్‌సీబీ 47 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

RCB : కోహ్లికి సాయం చేసిన పంత్‌.. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్ కు లైన్ క్లియ‌ర్‌..! ఇక మిగిలింది చెన్నై ఒక్క‌టే..

స్లో ఓవ‌ర్ కార‌ణంగా ఓ మ్యాచ్ నిషేదం ప‌డ‌డంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అయిన రిష‌బ్ పంత్ ఈ మ్యాచ్‌లో ఆడ‌లేదు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓ స‌ర‌దా స‌న్నివేశం చోటు చేసుకుంది. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో డ్రెస్సింగ్ రూమ్ వ‌ద్ద ఉన్న పంత్ బాల్కానీలోకి వ‌చ్చి కోహ్లి చూస్తూ న‌వ్వుతూ ఉన్నాడు. దీన్ని గ‌మ‌నించిన కోహ్లి కాస్త కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ న‌వ్వ‌డం ఆపి వెళ్లి కూర్చో.. లేదంటే బ్యాట్‌తో కొడ‌తా అన్న‌ట్లు సైగ చేశాడు. వెంట‌నే పంత్ వెళ్లి కూర్చోన్నాడు. త‌రువాత తాను కూర్చుకున్న‌ట్లుగా సైగ చేశాడు.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. వ‌ద్దు కోహ్లి భ‌య్యా.. ఇప్ప‌టికే సంవ‌త్స‌రం దాటిపోటింది.. పంత్‌ను ప్ర‌పంచ‌కప్ ఆడ‌నివ్వు అని అంటున్నారు.

Sehwag : గెలిచినా, ఓడినా రూ.400 కోట్ల లాభం.. చాల‌దా? ఓన‌ర్లు అయితే జ‌ట్టులో వేలు పెట్టాలా? : సెహ్వాగ్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌

రోడ్డు ప్ర‌మాదం కార‌ణంగా 16 నెల‌లు టీమ్ఇండియాకు దూరంగా ఉన్న పంత్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపికైన సంగ‌తి తెలిసిందే. విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు ఇదే చివ‌రి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అని ప్రచారం జ‌రుగుతోంది. దీంతో ఎలాగైనా స‌రే పొట్టి ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ విజ‌యం సాధించాల‌ని స‌గ‌టు భార‌త క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.