AA23 : అల్లు అర్జున్ సినిమాకి లోకేశ్ కనగరాజ్ షాకింగ్ రెమ్యునరేషన్ ?
లోకేశ్, బన్నీ కాంబో మూవీకి AA23 వర్కింగ్ టైటిల్‌గా ఫిక్స్ చేయగా.. ఈ సినిమా కోసం డైరెక్టర్‌కు మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది.
Latest gossip on Allu Arjun And Lokesh Kanagaraj Movie
AA23 : పుష్ప తర్వాత.. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతుండగా.. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో ఇంకో మూవీ చేయబోతున్నాడు బన్నీ. ఐతే ఈ సినిమాకు డైరెక్టర్ లోకేశ్ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఓ గాసిప్ తెగ వైరల్ అవుతోంది. ఇది ఫ్యాన్స్‌లో మరిన్ని అంచనాలు పెంచేస్తోంది..
పుష్ప సిరీస్‌తో తన యాక్టింగ్ రేంజ్ ఏంటో పాన్ ఇండియాకు చూపించిన అల్లు అర్జున్.. తన అప్‌కమింగ్ మూవీస్‌తో స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పుడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అట్లీ డైరెక్షన్లో మూవీ చేస్తున్న బన్నీ.. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించి చక్కర్లు కొడుతున్న ఓ గాసిప్.. బన్నీ ఫ్యాన్స్‌లో మరింత క్రేజ్ క్రియేట్ చేస్తోంది.
లోకేశ్, బన్నీ కాంబో మూవీకి AA23 వర్కింగ్ టైటిల్‌గా ఫిక్స్ చేయగా.. ఈ సినిమా కోసం డైరెక్టర్‌కు మైత్రీ మూవీ మేకర్స్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం! ఈ ప్రాజెక్ట్ కోసం లోకేష్‌కు ఏకంగా 75కోట్లు రెమ్యునరేషన్‌తో పాటు.. లాభాల్లో ఒక శాతం వాటా కూడా చెల్లించనున్నారట. సదరన్ సినిమాల్లో డైరెక్టర్లకు ఇలాంటి మెగా డీల్స్ రావడం చాలా అరుదు.
దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో షాకింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తోంది. ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇస్తున్నారంటే.. AA23 బ్లాక్‌బస్టర్ ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. ఈ డీల్ గురించి మైత్రీ మూవీ మేకర్స్ వర్గాల నుంచి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ రాకపోయినా.. లీక్ అయిన ఈ ఇన్ఫో మాత్రం ఫ్యాన్స్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ గాసిప్‌ను షేర్ చేస్తున్న ఫ్యాన్స్… ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు. ఇక సూపర్‌మ్యాన్ జోనర్లో స్టోరీ ఉంటుందనే టాక్ నడుస్తుండగా. మూవీ ఎప్పుడు ఫ్లోర్ మీదకు వెళ్తుందనే దానిపై త్వరలో క్లారిటీ రాబోతోంది.
