Alekhya : కుంకుమ పెట్టుకోవద్దు అన్నారు.. వెళ్లకూడదని డిసైడ్ అయ్యా.. తారకరత్న చనిపోయాక అలేఖ్య ఇబ్బందులు..
తారకరత్న మరణం తర్వాత మొదటిసారి బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అలేఖ్య. (Alekhya)
Alekhya
Alekhya : హీరో తారకరత్న 2023లో మరణించిన సంగతి తెలిసిందే. తారకరత్న మరణంతో ఆయన భార్య, పిల్లలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇప్పటికీ తారకరత్న భార్య అలేఖ్య సోషల్ మీడియాలో ఆయన్ని తలుచుకుంటూ పోస్టులు చేస్తూనే ఉంటారు.
తారకరత్న మరణం తర్వాత మొదటిసారి బయటకి వచ్చి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అలేఖ్య. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలు మాట్లాడింది. అలాగే తారకరత్న మరణించాక తను ఫేస్ చేసిన పలు ఇబ్బందుల గురించి కూడా తెలిపింది.
Also Read : Alekhya Tarakratna : మా ప్రేమని ఒప్పుకోలేదు.. కనీసం పిల్లల్ని అయినా దగ్గరకు తీసుకోవాలి.. అలేఖ్య ఎమోషనల్..
అలేఖ్య మాట్లాడుతూ.. ఆయన లేరు అని నేను ఒక్కోసారి యాక్సెప్ట్ చేయలేను. కానీ కొంతమంది ఇంకా గుర్తుచేస్తారు. ఓ పూజలో సడెన్ గా చెయ్యి పట్టుకొని నువ్వు కుంకుమ పెట్టుకోకు, నువ్వు హారతి ఇవ్వకు అని ఆపేసినప్పుడు గుండె పగిలిపోయింది. అప్పుడు నేను చాలా ఏడ్చాను. మా ఇంట్లో వాళ్ళు అలాంటి డిఫరెన్స్ చూపించారు. కానీ బయట సొసైటీ అలాగే చూస్తుంది. అలా జరగడంతో ఆ తర్వాత ఇంకెప్పుడు పూజలకు, ఫంక్షన్స్, పెళ్లిళ్లకు వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను. పిలవద్దు అని కూడా చెప్పాను.
నేను అంతకుముందు ఇప్పుడు ఒకే దేవుడ్ని పూజిస్తున్నాను. అలాంటిది బొట్టు పెట్టుకోవద్దు అని చెప్పడం ఏంటో. రూల్ బుక్ ఏమైనా ఉందా విడోస్ ఇలాగే ఉండాలి అని. ఆ పదం వాడటం కూడా పెయిన్ ఇస్తుంది అంటూ ఎమోషనల్ అయింది.
Also Read : Alekhya Tarakaratna : అప్పట్లో తారక్ ని వద్దన్నాను.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీపై అలేఖ్య కామెంట్స్..
