BEL Recruitment 2026 : బీటెక్ పూర్తి చేశారా.. అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి.. నెలకు రూ.60 వేల జీతం పొందే అవకాశం
BEL Recruitment 2026: బీటెక్ పూర్తి చేసిన వారికి బంపరాఫర్.. నెలకు రూ. 60 వేల జీతం పొందేందుకు అవకాశం.
BEL Engineer Recruitment 2026 Out for 56 Project and Field Engineer Posts full details here
BEL Recruitment 2026 : బీఈ లేదా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, బెంగళూరులోని ప్రముఖ ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (Bharat Electronics Limited (BEL)) పలు విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఇంజినీర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన, ఆసక్తిగల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరుతోంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా.. ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టుల వివరాలు
ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ – 25 పోస్టులు
కేటగిరీల వారీగా ఖాళీలు:
- జనరల్ – 11
- ఎస్సీ – 4
- ఎస్టీ – 2
- ఓబీసీ (ఎన్సీఎల్) – 6
- ఈడబ్ల్యూఎస్ – 2
ప్రాజెక్ట్ ఇంజినీర్-1 – 31 పోస్టులు
కేటగిరీల వారీగా ఖాళీలు:
- జనరల్ – 12
- ఎస్సీ – 5
- ఎస్టీ – 2
- ఓబీసీ (ఎన్సీఎల్) – 9
- ఈడబ్ల్యూఎస్ – 3
విద్యార్హతలు
- ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్, మెకానికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో బీఈ/బీటెక్ లేదా నాలుగేళ్ల బీఎస్సీ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
- వీరితో పాటు ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ చేసిన అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం
- ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టుకు కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
- ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు రెండేళ్ల పని అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి (2026 జూన్ 1 నాటికి)
- ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ పోస్టుకు గరిష్ట వయసు – 40 సంవత్సరాలు
- ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టుకు గరిష్ట వయసు – 32 సంవత్సరాలు
సడలింపు:
ఈ పోస్టులకు వయోపరిమితి సడలింపు అవకాశం కల్పిస్తున్నారు. దీని ప్రకారం
- ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు,
- ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
కాంట్రాక్ట్ వ్యవధి
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను ప్రారంభంలో మూడేళ్లపాటు కాంట్రాక్ట్ ఆధారంగా నియమిస్తారు. అభ్యర్థి పనితీరు సంతృప్తికరంగా ఉంటే మరో రెండేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది.
వేతనం
- ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్‌కు నెలకు రూ.60,000
- ప్రాజెక్ట్ ఇంజినీర్-1కు నెలకు రూ.40,000
- కాంట్రాక్ట్ పొడిగించిన ప్రతి ఏడాది రూ.5,000 చొప్పున జీతం పెరుగుతుంది.
- జీతంతో పాటు అదనంగా మెడికల్ ఇన్సూరెన్స్, దుస్తుల అలవెన్స్, స్టిచింగ్ ఛార్జీలు, ఫుట్‌వేర్ అలవెన్స్‌ల రూపంలో ప్రత్యేక భత్యాలు కూడా అందిస్తారు.
ఎంపిక విధానం
- అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ఈ పరీక్ష 85 మార్కులకు ఉంటుంది.
- రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ తేదీలను BEL అధికారిక వెబ్సైట్లో ప్రకటించడంతో పాటు అభ్యర్థుల ఈమెయిల్‌కు సమాచారం పంపిస్తారు.
దరఖాస్తు ఫీజు
- ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్ – రూ.450 + జీఎస్టీ
- ప్రాజెక్ట్ ఇంజినీర్-1 – రూ.400 + జీఎస్టీ
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం – 20 మే 2026
- దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – 08 జూన్ 2026
ఎలా దరఖాస్తు చేయాలంటే..
- అభ్యర్థులు ముందుగా BEL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- ఆ తర్వాత Careers విభాగంలో సంబంధిత నోటిఫికేషన్‌ను ఓపెన్ చేయాలి.
- అక్కడ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు వేర్వేరు అప్లికేషన్ లింకులు ఉంటాయి.
- అవసరమైన వివరాలు నమోదు చేసి, డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫీజు చెల్లిస్తే దరఖాస్తు పూర్తవుతుంది.
