Wi-Fi 7 Era : భారత్‌లో Wi-Fi 7 ఎంట్రీ.. యూజర్లకు బెనిఫిట్స్ ఇవే.. సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్తో బఫరింగ్‌కు ఫుల్ స్టాప్!
Wi-Fi 7 Era : భారత మార్కెట్లో స్వదేశీ టెక్నాలజీతో హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం వై-ఫై 7 డివైజ్ తయారీ ప్రారంభమైంది. తక్కువ ఖర్చుతో ఎలాంటి బఫరింగ్ లేకుండా హైస్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.. యూజర్లకు కలిగే లాభాలివే..
Wi-Fi 7 Era
Wi-Fi 7 Era : సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ టెక్నాలజీ వస్తోంది. Wi-Fi 7 టెక్నాలజీతో ఎలాంటి బఫరింగ్ లేకుండా 4K వీడియోలను కూడా చూసేయొచ్చు. దేశీయ ఇంటర్నెట్ యూజర్ల కోసం టీపీ-లింక్ (TP-Link) భారత్‌లోనే కొత్త జనరేషన్ (Wi-Fi 7) డివైజ్‌లను తయారు చేయనుంది. దేశీయ మార్కెట్లో రౌటర్లు, యాక్సెస్ పాయింట్లు వంటి ఇంటర్నెట్ డివైజ్‌లను ఇకపై విదేశాల నుంచి పూర్తగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు.
స్వదేశీ టెక్నాలజీతోనే కనెక్టవిటీ డివైజ్‌లు తయారు చేసుకోవచ్చు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా దేశీయ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్టు, నెక్ట్స్ జనరేషన్ టెలికాం మౌలిక సదుపాయాల కోసం దేశంలోనే వై-ఫై 7 ప్రొడక్టుల రేంజ్ స్థానికంగా తయారు చేయడం ప్రారంభమైందని టీపీ-లింక్ ఇండియా సోమవారం ప్రకటించింది.
ఒమాడా EAP770 ఎంటర్ప్రైజ్ యాక్సెస్ పాయింట్‌తో దేశంలో Wi-Fi 7 డివైజ్‌ల తయారీని ప్రారంభించినట్లు ఆ కంపెనీ తెలిపింది. తద్వారా దేశీయ డిజిటల్ కనెక్టివిటీ వ్యవస్థకు మరింత ప్రయోజనం కలుగనుంది. జనవరి ప్రారంభంలో, ప్రభుత్వ నోటిఫికేషన్ 5925–6425 MHz బ్యాండ్‌లో 500MHz స్పెక్ట్రమ్‌ను లైసెన్స్-రహిత వినియోగం కోసమే అందుబాటులోకి తీసుకొచ్చింది.
టీపీ-లింక్ ఇండియా ప్రకారం.. దేశంలో విక్రయించే తమ ప్రొడక్టులను దాదాపు 92 శాతం ఇప్పటికే దేశీయ EMS భాగస్వాముల ద్వారా స్థానికంగానే తయారవుతున్నాయి. రాబోయే మూడేళ్లలో ఈ స్థాయిని 96–97 శాతానికి పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ-ఆధారిత అప్లికేషన్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) ఎకోసిస్టమ్‌లు, అవసరమైన హై-స్పీడ్, లో-లేటెన్సీ కనెక్టివిటీ విస్తరణకు వీలుంటుందని టీ-లింక్ పేర్కొంది. అసలు వై-ఫై 7 టెక్నాలజీ ఏంటి? వినియోగదారులకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
వై-ఫై 7 ఏంటి? :
వై-ఫై 7 అనేది ప్రస్తుత వై-ఫై 6 కన్నా ఫాస్ట్ అండ్ స్టేబుల్ వైర్లెస్ ఇంటర్నెట్ టెక్నాలజీని అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. హై స్పీడ్ ఇంటర్నెట్, తక్కువ ల్యాగ్ (Delay) ఉంటుంది. ఒకేసారి చాలా డివైజ్‌లు కనెక్ట్ అయినా పర్ఫార్మెన్స్ ఏమాత్రం తగ్గదు. 4K, 8K వీడియోలు, గేమింగ్, ఏఐ యాప్‌లు చాలా ఫాస్ట్ యాక్సస్ చేయొచ్చు.
వినియోగదారులకు ప్రయోజనాలేంటి? :
వై-ఫై 7 అందుబాటులోకి వస్తే ఇంటర్నెట్ స్పీడ్ మరింత పెరుగుతుంది. వీడియోలు బఫరింగ్ లేకుండా ప్లే చేయొచ్చు. పెద్ద ఫైళ్లు కూడా త్వరగా డౌన్లోడ్ చేయొచ్చు. ఆన్లైన్ గేమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే, ఇంట్లో ఒకేసారి చాలామంది ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఉపయోగించినా నెట్ స్లో అయ్యే ఛాన్స్ ఉండదు.
డివైజ్ ధరలు తగ్గే ఛాన్స్ :
దేశంలోనే తయారీ ఉంటే దిగుమతి భారీగా ఖర్చులు దిగి వస్తాయి. డివైజ్ ధరలు కొంతవరకు తక్కువగా ఉండొచ్చు. భారత మార్కెట్‌కు సరిపోయే ప్రొడక్టులు త్వరగా అందుబాటులోకి వస్తాయి. దాంతో మంచి టెక్నాలజీ సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తుంది.
గ్రామాలు, చిన్న పట్టణాలకు ఫాస్ట్ కనెక్టివిటీ :
స్థానిక తయారీ పెరగడం వల్ల కంపెనీలు భారత అవసరాలకు తగ్గట్టు డివైజ్‌లను తయారు చేస్తాయి. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్పీడ్ వై-ఫై అందుబాటులోకి వస్తుంది. స్కూల్స్, హాస్పిటల్స్‌లో మెరుగైన ఇంటర్నెట్, చిన్న వ్యాపారాలకు డిజిటల్ సౌకర్యాలు అందుతాయి.
ఆన్లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు బెస్ట్ :
వై-ఫై7 అందుబాటులోకి వస్తే ఆన్లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రయోజకరంగా మారుతుంది. వీడియో క్లాసులకు ఇబ్బంది ఉండదు. జూమ్, గూగుల్ మీట్ కాల్స్ క్లియర్‌గా ఉంటాయి.
ఇంటి నుంచి పనిచేసే వారికి స్పీడ్ కనెక్షన్ లభిస్తుంది. ఒకేసారి ఇంట్లో పలువురు ఆన్లైన్లో ఉన్నా నెట్ స్పీడ్ తగ్గదు.
ఏఐ, IoT, స్మార్ట్ హోమ్ డివైజ్ లకు సపోర్టు :
- స్మార్ట్ టీవీలు
- స్మార్ట్ కెమెరాలు
- అలెక్సా/గూగుల్ హోం డివైజ్‌లు
- ఏఐ ఆధారిత యాప్‌లకు Wi-Fi 7 స్పీడ్ సపోర్టు అందుతుంది.
కొత్త ఉద్యోగాలు వస్తాయి :
స్థానికంగా తయారీ పెరిగితే దేశీయ మార్కెట్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కూడా డెవలప్ అవుతుంది. భారత్ గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా ఎదగడానికి అద్భుతమైన అవకాశంగా చెప్పవచ్చు.
6GHz బ్యాండ్ ఎందుకు బెటర్? :
కేంద్ర ప్రభుత్వం 6GHz స్పెక్ట్రమ్‌ను లైసెన్స్ లేని వై-ఫై అందుబాటులోకి వస్తుంది. అంటే.. కనెక్షన్ వేగంగా, స్టేబుల్‌గా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మంది వై-ఫై వాడినా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
