Oppo Find X8 Pro : వారెవ్వా.. ఆఫర్ అదిరింది మావా.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఇంత తక్కువా? మీ బడ్జెట్లోనే..!
Oppo Find X8 Pro : ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో అదిరిపోయే డీల్.. ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ క్రేజీ డీల్ ఎలా పొందాలంటే?
Oppo Find X8 Pro
- ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో రూ. 99,999 ధరకే లాంచ్
- క్రోమాలో ప్రస్తుతం రూ. 86,999 ధరకు లభిస్తోంది
- అసలు ధర నుంచి రూ. 13,000 ఫ్లాట్ డిస్కౌంట్
Oppo Find X8 Pro : ఒప్పో లవర్స్ డోంట్ మిస్.. కొత్త ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డీల్.. ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆన్లైన్లో రూ. 13వేలు భారీ తగ్గింపుతో లభిస్తోంది.
పవర్ఫుల్ కెమెరా సిస్టమ్, లాంగ్ బ్యాటరీ లైఫ్, ప్రీమియం డిజైన్‌తో సహా ఫ్లాగ్షిప్-గ్రేడ్ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఆఫర్లు లిమిటెడ్ టైమ్ వరకే అందుబాటులో ఉంటాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ డీల్ ముగిసేలోపు కొనేసుకోవడం బెటర్. ఈ స్మార్ట్‌ఫోన్ అన్ని ఫీచర్లు పూర్తి ఆఫర్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఒప్పో ఫైండ్ X8 ప్రో డీల్ :
భారత మార్కెట్లో ఒప్పో ఫైండ్ ఎక్స్8 ప్రో ఫోన్ రూ. 99,999 ధరకు లాంచ్ అయింది. క్రోమా అధికారిక వెబ్సైట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 86,999 ధరకు లిస్ట్ అయింది. రిటైలర్ ఫైండ్ ఎక్స్8 ప్రోపై రూ. 13వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
ఒప్పో ఫైండ్ X8 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఒప్పో ఫైండ్ X8 ప్రో ఫోన్ 6.78-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్, డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఫైండ్ X8 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 5,910mAh బ్యాటరీతో వస్తుంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే..
ఒప్పో ఫైండ్ X8 ప్రో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ LYT808 ప్రైమరీ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP సోనీ LYT600 పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 6x ఆప్టికల్ జూమ్ 120x వరకు డిజిటల్ జూమ్‌తో 50MP సోనీ IMX858 లెన్స్, 50MP శాంసంగ్ అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరా కూడా ఉంది.
ఒప్పో ఫోన్ కొనాలా వద్దా? :
పాత జనరేషన్ ఫోన్ అయినా ఒప్పో ఫైండ్ X8 ప్రో ఇప్పటికీ ఫ్లాగ్షిప్ కేటగిరీలో దూసుకుపోతోంది. ప్రస్తుత తగ్గింపు ధరకే లభిస్తోంది. ప్రీమియం డిజైన్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్ ఫుల్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్. కెమెరా పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఆప్షన్లతో వస్తుంది. ఒప్పో ఫైండ్ X8 ప్రో కొనాలని అనుకునేవారికి ఇదే అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు.
