karthi 30 : కార్తీ బర్త్‌డే స్పెషల్.. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన కొత్త మూవీ.. ఫోటోలు..
హీరో కార్తీ కొత్త సినిమా షూటింగ్ (karthi 30) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

కోలీవుడ్‌లో కాకుండా టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తీ. ఆయన పుట్టిన రోజు (మే 25) నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కార్తీ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కార్తీ కెరీర్లో 30 సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

కార్తీ 30 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం నిర్మిమితమవుతోంది.

ఈ చిత్రంలో కార్తీ సరసన మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.

ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అతి తొందరలోనే వెల్లడించనున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది.
